ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఇక ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో చాలామంది పక్షవాతం బారిన పడుతున్నారు. పక్షవాతం బారిన పడిన వారి జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది.
ఏ పని చేయలేని స్థితిలో మంచానికి పరిమితమై ఉండాల్సి వస్తుంది. అయితే పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే పక్షవాతం రావడానికి ముందు కనిపించే కొన్ని లక్షణాల విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.
పక్షవాతానికి ముందు కనిపించే లక్షణాలు
పక్షవాతం మనకు చెప్పకుండా రాదు. కొన్ని లక్షణాలను మనకు చూపిస్తూ వస్తుంది. ఇక ఆ లక్షణాలను గురించి తెలుసుకుంటే పక్షవాతం రావడానికి ముందు తగిన జాగ్రత్త తీసుకునే వీలు ఉంటుంది. పక్షవాతం రావటానికి ముందు ఒక వైపు శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. చెయ్యి కానీ కాలు కానీ ఒకేసారి బలహీన పడుతుంది. ముఖం వంకరగా మారుతుంది. నవ్వుతున్న, మాట్లాడుతున్న ముఖం ఒకవైపుకు వంగినట్టు కనిపిస్తుంది.
పక్షవాతానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి
పక్షవాతం రావడానికి ముందు కొంచెం మాటలలో తొట్రుబాటు ఉంటుంది. మాట్లాడే మాటలు అర్థం కాక కొంచెం తడబడుతున్నట్టుగా మాట్లాడుతారు. ఇది పక్షవాతానికి ఒక సంకేతం. పక్షవాతం రావడానికి ముందు శరీర సమతుల్యత కోల్పోతారు. నిలబడడంలోనూ లేదా నడవడంలోనూ ఇబ్బంది పడతారు. తడబాటుకు గురవుతూ ఉంటారు,
కళ్ళు, చెవులలో ఈ ఇబ్బంది.. పక్షవాతానికి ముందు లక్షణాలు
పక్షవాతం వచ్చే ముందు కంటి చూపు మందగిస్తుంది. ఒక కన్ను లేదా రెండు కళ్ళు చూపు మందగించవచ్చు. దృష్టి బ్లర్ గా కనిపించవచ్చు. చూపులో మార్పులు వస్తాయి. ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది. వస్తువులు తిరుగుతున్నట్టు కనిపిస్తాయి. పక్షవాతం రావడానికి ముందు తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఈ తలనొప్పి అంతకు ముందు వచ్చిన తలనొప్పుల కన్నా భిన్నంగా ఉంటుంది.
పక్షవాతం విషయంలో జాగ్రత్త
ఇక పక్షవాతం వచ్చే ముందు ఒక చెవిలో కానీ రెండు చెవులలో కానీ శబ్దాలు అస్పష్టంగా వినబడతాయి. ఈ లక్షణాలు మీకు అనిపించినట్లయితే వెంటనే వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. పక్షవాతం వచ్చిన తర్వాత ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకునే కంటే రాకుండానే తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.