తల్లి అరిచిందని ఒకరు.. ప్రేమ ఆకర్షణతో మరొకరు ఇంటి నుంచి వెళ్లిపోగా.. అదృశ్యమైన కొన్ని గంటల్లోనే ఇద్దరు మైనర్ బాలికలను సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించి రక్షించారు. ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేసిన ఒక్క రోజులోనే బాలికలను కాపాడారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇటీవల అదృశ్యమైన ఆరుగురు చిన్నారులను డ్రోన్ల సాయంతో గాలించి పట్టుకున్నారు. అయితే అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండటం లేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
Also Read
Education
More