ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.
పదో తరగతి పాసైతే చాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మంచి వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలను సాధించి లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మొత్తం 8,326 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 4887 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 3439 హవల్దార్ పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు టెన్త్ పాసైతే చాలు. అర్హత, ఆసక్తి ఉన్నవారు జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంటీఎస్ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు 18-25 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. హవల్ధార్ పోస్టులకు 18-27 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 18000 నుంచి రూ. 22000 వరకుఅందిస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు: 8,326
విభాగాల వారీగా ఖాళీలు:
ఎంటీఎస్: 4,887
హవల్దార్: 3,439
అర్హత:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టులకు పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదోతరగతి పాసై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలి.
వయసు:
ఎంటీఎస్ పోస్టులకు అభ్యర్థులు 18-25 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. హవల్ధార్ పోస్టులకు 18-27 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 18000 నుంచి రూ. 22000 వరకుఅందిస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ, మాజీ సైనికులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు కలిగించారు.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ:
27-06-2024
దరఖాస్తుకు చివరి తేదీ:
31-07-2024