పంట పొలాల్లో పవన్..! బురదలోనే అడుగులేస్తూ.

పీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ దివిసీమ పర్యటనకు వెళ్లారు. మొంథా తుపాన్ కారణంగా ప్రభావిత మైన అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు.


ఇక్కడ నీట మునిగిన పొలాలను ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులతో కలిసి పవన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పంట పొలాల్లో బురదలోకి దిగి మరీ నడుస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

మొంథా తుపాన్ నేపథ్యంలో రెండు రోజులుగా అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సీఎం చంద్రబాబుతో కలిసి సహాయక చర్యల్ని పర్యవేక్షించిన పవన్ కళ్యాణ్.. ఇవాళ తుపాన్ ప్రభావం తగ్గడంతో క్షేత్రస్థాయికి వెళ్లారు. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవనిగడ్డ నియోజకవర్గంపై తుపాను ప్రభావం చాలా ఉంది. మచిలీపట్నం తీరానికి దగ్గర్లో ఉన్న ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తున పంట పొలాలు నీట మునిగాయి.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ ఉదయం స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి పంటపొలాల్ని పరిశీలిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా బురద నిండిన పంట పొలాల్లోకి దిగి మరీ పరిశీలించారు. అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టం పరిశీలించిన స్వయంగా రైతుల్ని కలిసి వివరాలు తీసుకుంటారు. అనంతరం ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పిస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.