ఆంధ్రప్రదేశ్(AP) డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడ్డారు. ఈ విషయాన్ని CMO వర్గాలు వెల్లడించాయి. పవన్ కళ్యాణ్ తీవ్ర వైరల్ ఫీవర్(Viral Fever), స్పాండిలైటిస్తో ఇబ్బందిపడుతున్నారు అని అన్నారు.
ఆయనకు టెస్టులు చేసిన వైద్యులు.. డిప్యూటీ సీఎంకు వైరల్ ఫీవర్ సోకిందని.. ఆయనకు బెడ్ రెస్ట్ చాలా అవసరమని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు.
కేబినెట్ సమావేశానికి రాకపోవచ్చు
దీంతో వైద్యుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. దీని కారణంగా ఆయన గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశానికి హాజరు కాలేకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ రాత్రిలోగా ఆయన కోలుకుంటే తప్పకుండా కేబినెట్ సమావేశానికి హాజరవుతారని సమాచారం.
పవన్ కళ్యాణ్ సినిమాలు
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నాడు. డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్సింగ్’లో నటిస్తున్నాడు. అలాగే హరిహర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నాడు.
ఈ మూడు సినిమాల్లో ఓజీ షూటింగ్ చాలా వరకు జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ చాలా వరకు చిత్రీకరించారని సమాచారం. మరోవైపు హరిహరవీరమల్లు లాస్ట్ షెడ్యూల్ నేడు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన అనారోగ్యం భారిన పడటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
































