దీపావళిని మించి ఏపీలో అసలైన పండుగకు సిద్ధం అవుతున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ప్రయత్నం చేస్తుంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడానికి తన వంతుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.


త్వరలో పల్లె పండుగ 2.0

ఇప్పటికే అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం పల్లె పండుగను నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి గ్రామాలలో పండుగ వాతావరణం తీసుకువచ్చిన ఆయన ఈ సంవత్సరం మళ్లీ గ్రామాల రూపురేఖలు మార్చడానికి రెడీ అయ్యారు. పల్లె పండుగ 2.0 కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల వెల్లడించారు.

అధికారులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం

ఈ మేరకు పల్లె పండుగ 2.0 లో ఏం చేయాలి అనే దానిపైన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత అక్టోబర్లో పల్లె పండుగకు శ్రీకారం చుట్టి వారోత్సవాలు నిర్వహించి 4,500 కోట్ల రూపాయలతో 30వేల అభివృద్ధి పనులను చేయగా, ప్రస్తుతం గతేడాది కొనసాగించిన స్ఫూర్తిని మళ్ళీ కొనసాగించాలని పల్లె పండుగ 2.0 ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.

పల్లె పండుగ 2.0లో చేసే పనులు ఇవే

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదం చేసే ఈ కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారాలి అన్నారు. ఈ కార్యక్రమంలో రహదారుల అభివృద్ధి, మరమ్మత్తులు, కొత్త రహదారుల నిర్మాణం, గోశాలలు, మ్యాజిక్ డ్రెయిన్ ల ఏర్పాటు వంటి అనేక అంశాల పైన అధికారులకు దిశానిర్దేశం చేసిన ఆయన గ్రామాలలో చేపట్టే పనులలో నాణ్యతలో రాజీపడకుండా, త్వరితగతిన పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఉపాధి హామీ కూలీలకు ఉపాధి

చక్కని ప్రణాళికతో పల్లె పండుగ 2.0 నిర్వహించాలని పేర్కొన్న పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రిగా గ్రామాలను అభివృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నారు. ఇక ఈ పనుల ద్వారా ఉపాధి హామీ కూలీలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద వచ్చిన 12 వేల కోట్ల రూపాయల నిధులు నిరుపయోగంగా మారగా, కూటమి ప్రభుత్వ హయాంలో చక్కని ప్రణాళికతో నిధులను సద్వినియోగం చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.