సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన పవన్‌కళ్యాణ్‌ లేటెస్ట్‌ ట్వీట్‌

వర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్‌.. నాలుగు రోజులుగా మంగళగిరిలోనే వైద్యం చేయించుకుంటున్నారు.


వైద్యుల సూచన మేరకు ఆయన శుక్రవారం వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ చేరుకున్నారు. పవన్‌కళ్యాణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ’ భారీ విజయం సాధించి, అభిమానులకు ఆనందాన్నిస్తున్న నేపథ్యంలో పవన్‌ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త వారిని ఆందోళనకు గురి చేస్తోంది. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ లేటెస్ట్‌ మూవీ ‘ఓజీ’ భారీ విజయాన్ని అందుకొని కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది.

ఇలాంటి సమయంలో పవన్‌ అనారోగ్యం పాలయ్యారనే వార్త అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే ఎటువంటి ఆందోళన అక్కర్లేదని, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగానే ఆయన అనారోగ్యానికి గురయ్యారనే మాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే పవన్‌కళ్యాణ్‌ చేసిన ట్వీట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్‌కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పుడీ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.