పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. నాకు జీతం వద్దు.. దానికోసమే పనిచేస్తా?

www.mannamweb.com


పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. నాకు జీతం వద్దు.. దానికోసమే పనిచేస్తా?

Pawan Kalyan: పిఠాపురంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయో తెలియట్లేదని అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.

గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జీతం తీసుకుని పనిచేద్దాం అనుకున్నా.. కానీ శాఖలో డబ్బులు లేకపోవడం, వేల కోట్ల అప్పులు చూసి జీతం తీసుకోకుండా ఎమ్మెల్యేగా పనిచేద్దా అని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అప్పుల కారణంగా ఆఫీస్‌లో కొత్త ఫర్నిచర్, మరమ్మత్తులు కూడా తన కార్యాలయానికి చేయించలేదని తెలిపారు. ఇంతే కాకుండా తనకి కావాల్సిన ఫర్నీచర్ తానే తెచ్చుకుంటానని వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసమే తాను పనిచేస్తానన్నారు. విజయయాత్రలు మాత్రమే చేయడానికి నేను సిద్ధంగా లేనని తెలాపారు. గెలిచినందుకు తనకి ఆనందం లేదని.. తన వంతుగా పనిచేసి ప్రజల మన్ననలు పొందితేనే తనకి ఆనందం కలుగుతుందన్నారు.

పిఠాపురాన్ని దేశంలోనే అగ్రగామిగా తయారుచేయాలన్నదే తన లక్ష్యం అని.. అందుకే నెపుణ్య శిక్షణ ఇచ్చి యువతలో నైపుణ్యాలను వెలికి తీస్తాన్నారు. పర్యావరణ పరక్షణకు అనుకూలంగా ఉండే పరిశ్రమలు ఇక్కడి రావాలని కోరారు. నైపుణ్య శిక్షణ ద్వారా విదేశాలకు వెళ్లే వారికి శిక్షణ ఇప్పించి పంపాలన్నారు. డబ్బులు వెనకేసుకోవాలనో, కొత్తగా పేరు రావాలనో తనకి ఆశ లేదన్నారు.