ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో పేటీఎంకు మాతృసంస్థ అయిన వన్97 కమ్యూనికేషన్స్‌కు సంబంధించిన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని రూ.
2,048 కోట్లకు కొనుగోలు చేయనుంది. సమస్యాత్మకమైన ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎం చెల్లింపులు, ఆర్థిక సేవల పంపిణీకి సంబంధించిన ప్రధాన కార్యకలాపాలపై దృష్టి పెట్టేందుకు ఈ డీల్ సహాయం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పేటీఎం వినోదం టికెటింగ్ వ్యాపారం లు, క్రీడలు, ఈవెంట్‌లను కవర్ చేస్తుంది. పేటీఎం తన ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని విక్రయించడానికి తీసుకున్న చర్య చెల్లింపులు, ఆర్థిక సేవలపై ఇకపై దృష్టి సారిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పేటీఎం-జొమాటో డీల్ గురించి వివరాలను తెలుసుకుందాం.
ఇటీవలి త్రైమాసికాల్లో కంపెనీ తన ఆఫర్లను బీమా, ఈక్విటీ బ్రోకింగ్, సంపద పంపిణీలో విస్తరించింది. ఈ సేవలను క్రాస్-సేల్ చేయడానికి, ప్రముఖ ఆర్థిక సేవల పంపిణీ ప్లేయర్‌గా తన మార్కెట్ ఉనికిని పెంచుకోవడానికి గణనీయమైన అవకాశం ఉంది. వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (ఓసీఎల్) పేటీఎం-జొమాటో డీల్‌ను ప్రకటించింది. ఇది రూ.2,048 కోట్ల విలువైన నగదు రహిత, రుణ రహిత ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారం దాని 100 శాతం అనుబంధ సంస్థలైన ఓబ్గన్ టెక్నాలజీస్, వేస్ట్ ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లకు వ్యాపారాన్ని బదిలీ చేస్తుంది. ఆ తర్వాత ఈ అనుబంధ సంస్థలలో 100 శాతం వాటాను విక్రయిస్తుంది. తదనంతరం జొమాటో కొత్త వ్యాపారాన్ని ‘డిస్ట్రిక్ట్’ అనే కొత్త యాప్‌గా మారుస్తుంది.
ఈ డీల్ ప్రకారం జొమాటో టిక్కెట్‌ల వ్యాపారంలో ఉన్న ఓబ్గన్ టెక్నాలజీస్‌ని పూర్తిగా రూ. 1,264.6 కోట్లకు కొనుగోలు చేస్తుంది. అలాగే ఈవెంట్‌ల టిక్కెట్టును రూ. 783.8 కోట్లకు వెస్ట్‌ల్యాండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ ఒప్పందం పేటీఎం తన ఆర్థిక సేవల వ్యాపారంపై దృష్టి పెట్టడంలో సహాయపడినప్పటికీ కొత్త సెగ్మెంట్‌ను జోడించడం ద్వారా జొమాటోల ఆదాయాన్ని పెంచుతుంది. ఇప్పటికే జొమాటో ద్వారా బ్లింక్ ఇట్ కొనుగోలు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌కు భారీగా సహాయపడింది. దాని నికర లాభం జూన్ 2024 త్రైమాసికంలో రూ. 293 కోట్లకు పెరిగింది. పేటీఎంకు సంబంధించిన కంబైన్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ టికెటింగ్ వ్యాపారం ఎఫ్‌వై24లో రూ. 297 కోట్ల ఆదాయాన్ని, సర్దుబాటు చేసిన ఈబీఐటీడీఏలో రూ. 29 కోట్లను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త వ్యాపారాన్ని ‘డిస్ట్రిక్ట్’ అనే కొత్త యాప్‌గా మారుస్తుంది.ఈ తాజా చర్యలతో బీఎస్ఈలో వన్ 97 కమ్యూనికేషన్స్ షేర్లు రూ. 11.10 లేదా 1.94 శాతం పెరిగి ఒక్కొక్కటి రూ. 584.2 వద్ద ట్రేడ్ అవుతుండగా జోమాటో షేర్లు బీఎస్‌ఈలో 0.01 శాతం తగ్గి రూ. 260 వద్ద ట్రేడయ్యాయి.