బ్రౌన్‌రైస్‌లో పీచు… ఆరోగ్యానికి మేలు

న ప్రాంత వాతావరణానికి అనుగుణంగా పూర్వం నుంచీ ఎక్కువమందికి అన్నం తినడమే అలవాటు. అయితే, మారిన జీవనశైలి, అలవాట్లు, అనారోగ్యాల ప్రభావంతో రైస్‌కి దూరంగా ఉండాలనుకునేవారు చాలామందే. అలాగని తినకుండానూ ఉండలేరు. అలాంటివారు బ్రౌన్‌ రైస్‌ని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటే సరి. బ్రౌన్‌రైస్‌లో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులు రావట. గ్లైసమిక్‌ ఇండెక్స్‌ స్థాయులు తక్కువగా ఉండే బ్రౌన్‌రైస్‌ తినడం వల్ల నెమ్మదిగా జీర్ణమై రక్తంలో చక్కెర నిల్వలు నెమ్మదిగా పెరుగుతాయి. ఆకలి అదుపులో ఉండి బరువూ తగ్గొచ్చు. ఐరన్, కాల్షియం ఎముకల్ని బలంగా మారుస్తాయి. ఇక, ఈ బియ్యంలో విటమిన్లూ, ఖనిజాలతోపాటూ ఇతర పోషకాలూ పుష్కలంగా దొరుకుతాయి. ఇవి రోగనిరోధకశక్తిని అందిస్తాయి. ఫలితంగా శరీరంలో పేరుకున్న ఫ్రీరాడికల్స్‌నీ, వ్యర్థాలనూ బయటకు పంపిస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల వార్థక్యపు ఛాయల్ని త్వరగా రావు.


 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.