నిర్లక్ష్యం వహిస్తే పెన్షన్ కట్.. ఉద్యోగులు కేంద్రం హెచ్చరిక

www.mannamweb.com


హైదరాబాద్‌: విధుల్లో అలసత్వం వహించిన ఉద్యోగులకు పెన్షన్‌, గ్రాడ్యూటీ నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ మేరకు పెన్షన్‌, గ్రాడ్యూటీ సంబంధించి 7వ వేతన సంఘం రూల్స్‌ను మార్చి కోత్త రూల్స్‌ను తీసుకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విడుదల చేసిన ప్రభుత్వం, పనిలో పారదర్శకత కోసం ఈ నిబంధనల్లో మార్పులు చేసింది. విధుల్లో ఎక్కడ అలసత్వం వహించకుండా పని చేయాలని ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది. కేంద్రం తీసుకు వచ్చిన నిబంధనలను ఉద్యోగులు పట్టించుకోకపోతే పెన్షన్, గ్రాట్యుటీపై చాలా ప్రభావం పడుతుంది. ఏ ఉద్యోగస్థుడైన పనిలో నిర్లక్ష్యం వహిస్తే పదవీ విరమణ తరువాత పెన్షన్, గ్రాడ్యూటీని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు కేంద్ర ఉద్యోగులకు వర్తిస్తుందని తెలిపింది. భవిష్యత్‌లో రాష్ట్రాలు కూడా దీనిని అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ దిశగా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
నోటిఫికేషన్ ఇలా..

సెంట్రల్ సివిల్ సర్వీసెస్‌( పెన్షన్‌) రూల్స్ 2021 కింద కేంద్ర ప్రభుత్వం నోటీఫికేషన్ జారీ చేసింది. సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021లోని 8వ నిబంధనను కేంద్ర ప్రభుత్వం ఇటీవల మార్చి, కొత్త నిబందనను జోడించింది. దీని ప్రకారం కేంద్ర ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఏదైనా తీవ్రమైన నేరం చేసినా, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా, దోషిగా తేలినా పదవీ విరమణ తరువాత పెన్షన్, గ్రాడ్యూటీ నిలిపి వేయబడుతుందని తెలిపింది. అలాగే దోషులైన ఉద్యోగుల సమాచారం అందితే వెంటనే వారి పెన్షన్‌, గ్రాడ్యూటీలను నిలిపి వేసేలా చర్యలు తీసుకోవాలని స్పస్టం చేసింది.