EPFO : పెన్షన్‌ చెల్లింపులకు కేంద్రీయ వ్యవస్థ

www.mannamweb.com


ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు (ఈపీఎ్‌ఫఓ) చెందిన దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లోను కేంద్రీయ పెన్షన్‌ చెల్లింపు వ్యవస్థ (సీపీపీఎస్‌) అందుబాటులోకి వచ్చింది. ఇది 68 లక్షల మంది పెన్షనర్లకు

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు (ఈపీఎ్‌ఫఓ) చెందిన దేశంలోని అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లోను కేంద్రీయ పెన్షన్‌ చెల్లింపు వ్యవస్థ (సీపీపీఎస్‌) అందుబాటులోకి వచ్చింది. ఇది 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలిగిస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం పెన్షన్‌ చెల్లింపుల వ్యవస్థ వికేంద్రీకృతంగా ఉన్నందు వల్ల ప్రతి జోనల్‌/ప్రాంతీయ కార్యాలయం వేర్వేరుగా 3 లేదా 4 బ్యాంకులతో అంగీకారాలు కుదుర్చుకోవాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. ఈ సీపీపీఎస్‌ వ్యవస్థ కింద లబ్ధిదారుడు ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్‌ డ్రా చేసుకోవచ్చు. పెన్షన్‌ ప్రారంభం సమయంలో వెరిఫికేషన్‌ కోసం బ్యాంకుకు కూడా వెళ్లాల్సిన పని ఉండదు. పెన్షన్‌ మొత్తం విడుదల కాగానే లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ అయిపోతుంది. పెన్షనర్‌ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా లేదా లబ్ధిదారుని బ్యాంక్‌/బ్రాంచి మారిన సందర్భాల్లో ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్లు (పీపీఓ) జారీ చేయాల్సిన అవసరం లేకుండానే ఈ జనవరి నుంచి సీపీపీఎస్‌ వ్యవస్థ కింద పెన్షన్లు చెల్లించగలుగుతారు. రిటైర్మెంట్‌ అనంతరం స్వస్థలాలకు వెళ్లే పెన్షనర్లకు దీని ద్వారా పెద్ద ఊరట లభిస్తుంది. డిసెంబరు నాటికి ఈపీఎ్‌ఫఓ 122 పెన్షన్‌ చెల్లింపు ప్రాంతీయ కార్యాలయాల ద్వారా 68 లక్షల మంది పైగా పెన్షనర్లకు రూ.1570 కోట్ల మొత్తంలో పెన్షన్లు చెల్లిస్తోంది.