ఏందిరా భయ్యా ఇది ! 9 మంది కూర్చునే ఈ కారును సెల్‌ఫోన్లు కొన్నట్టు కొంటున్నారు

నం ఏదైనా కొత్త వస్తువు కొనాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాం. కానీ మహీంద్రా వారి బొలెరో కారును మాత్రం జనం సెల్‌ఫోన్ కొన్నంత ఈజీగా కొనేస్తున్నారు.


పల్లెటూర్ల నుంచి పట్టణాల వరకు రోడ్డు ఎలా ఉన్నా దూసుకుపోయే ఈ మాస్ కింగ్ కారు… మార్కెట్‌లో రిలీజ్ అయ్యి పాతిక సంవత్సరాలు దాటినా దాని క్రేజ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు.

ముఖ్యంగా 9 మంది కూర్చునే సౌకర్యం ఉన్న ఈ కారును జనం తక్కువ ధరకే దొరుకుతున్న ఆఫర్ అనుకుని ఎగబడి కొంటున్నారు. ఈ మధ్య బొలెరో అమ్మకాలు ఏకంగా 46 శాతం పెరిగాయంటే దీని పవర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మహీంద్రా బొలెరో కారు ఇండియా మార్కెట్‌లోకి వచ్చిన కొత్త కారు కాదు. ఇది మొట్టమొదటగా 2000వ సంవత్సరంలో లాంచ్ అయ్యింది. అంటే, ఇప్పటికి పావు శతాబ్దం (25 ఏళ్లు) గడిచినా, ఈ కారుపై నమ్మకం, ప్రేమ మాత్రం జనంలో అలాగే ఉంది.

ఈ కారు ఏసీ, సౌకర్యాలు కంటే… బిల్డ్ క్వాలిటీ, తక్కువ ఖర్చుతో మెయింటెనెన్స్, ఎంతమందికైనా చోటు ఇవ్వడం, రోడ్లు ఎలా ఉన్నా భయపడకుండా వెళ్లడం వంటి విషయాలకే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. అందుకే ఇది ఇప్పటికీ జనం ఇష్టపడే కారుగా నిలిచింది.

బొలెరో సేల్స్ నెంబర్స్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. మహీంద్రా కంపెనీ ఇచ్చిన లెక్కల ప్రకారం 2025 అక్టోబర్‌లో 14,343 యూనిట్లు అమ్ముడుపోగా, గతేడాది అంటే 2024 అక్టోబర్ నెలలో కేవలం 9,849 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. అంటే కేవలం ఒక సంవత్సరంలోనే, అక్టోబర్ నెలలో 4,494 కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. లెక్కల్లో చెప్పాలంటే ఇది ఏకంగా 46 శాతం వృద్ధిని నమోదు చేసి మార్కెట్‌కి పెద్ద షాక్ ఇచ్చింది.

పాత మోడల్ అయినా, అమ్మకాల్లో కొత్త కార్లకి పోటీ ఇస్తోంది బొలెరో. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్‌లో బొలెరో కారు మూడు ముఖ్యమైన వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో కొన్ని 7 సీటర్లు కాగా, కొన్ని ఏకంగా 9 సీటర్లుగా దొరుకుతున్నాయి. ఈ మూడు మోడల్స్ ధరలు మరియు సీటింగ్ సామర్థ్యం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

మొదటిది, సాధారణ బొలెరో (Bolero) వెర్షన్. ఇది 7 సీటర్ ఆప్షన్‌లో మాత్రమే దొరుకుతుంది. ఈ మోడల్ ప్రారంభ ధర కేవలం రూ.7.99 లక్షలుగా ఉంది. ఇక దీని టాప్ వెర్షన్ ధర రూ.9.69 లక్షల వరకు ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించడానికి ఈ మోడల్ చాలా మంచి ఆప్షన్.

తరువాత, కొంచెం స్టైలిష్‌గా ఉండే బొలెరో నియో (Bolero Neo) వెర్షన్ ఉంది. ఈ కారు కూడా 7 సీటర్ ఆప్షన్‌లోనే లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.8.49 లక్షలతో మొదలై, టాప్ వెర్షన్ ధర రూ.10.49 లక్షల వరకు ఉంటుంది. పాత బొలెరో కంటే ఇందులో కొన్ని ఆధునిక ఫీచర్లు అదనంగా ఉంటాయి.

చివరిగా, అతి ముఖ్యమైన మోడల్ బొలెరో నియో ప్లస్ (Bolero Neo Plus). కుటుంబం పెద్దగా ఉండి, ఎక్కువ మంది ప్రయాణించాలనుకునేవారికి ఇది బెస్ట్. ఎందుకంటే ఈ మోడల్ ఏకంగా 9 సీటర్ ఆప్షన్‌లో దొరుకుతుంది. దీని ప్రారంభ ధర రూ.10.77లక్షలు కాగా, అత్యంత ఖరీదైన టాప్ వెర్షన్ ధర రూ.12.90 లక్షల వరకు ఉంది. ఈ ధరలన్నీ మహీంద్రా కంపెనీ అధికారికంగా ప్రకటించిన ఎక్స్-షోరూమ్ ధరలు అని గుర్తుంచుకోవాలి.

బొలెరో నియో ప్లస్ లో 9 మంది కూర్చునే ఆప్షన్ ఉండడం ఈ కారుకున్న పెద్ద ప్లస్ పాయింట్. అలాగే, 5 సీటర్ల ఆంబులెన్స్ వెర్షన్ కూడా ఈ నియో ప్లస్ మోడల్‌లో దొరుకుతుంది. ఈ ధరలన్నీ మహీంద్రా అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్న ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.

తక్కువ ధరలో ఎక్కువ మంది కూర్చుని ఎలాంటి రోడ్డుపైన అయినా సులభంగా వెళ్లగలిగే కారు కావాలనుకునేవారికి బొలెరో ఒక వజ్రం లాంటిది. పెట్టే డబ్బుకు పూర్తి న్యాయం చేసే కారు ఇది. అందుకే 25 ఏళ్లు అయినా దీని సేల్స్ రికార్డులు ఏ మాత్రం తగ్గకుండా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.