సేల్స్ స్టార్ట్ కాకముందే 261 కి.మీ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు జనం బ్రహ్మరథం పట్టారు! అంత డిమాండ్ ఎందుకో?

ఎలక్ట్రిక్ టూవీలర్ రంగంలో అల్ట్రావయోలెట్ (ultraviolette) ఆటోమోటివ్ ఇప్పటికే తనదైన గుర్తింపు పొందింది. దుల్కర్ సల్మాన్ వంటి ప్రముఖులు భాగస్వాములుగా ఉండటంతో పాటు, కంపెనీ పరిచయం చేసిన స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్‌కి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభించింది. ఈ సంస్థ నుంచి ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ త్వరలో రాబోతుంది. ఈ మోడల్ పేరు టెస్సెరాక్ట్ (tesseract). కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకునేందుకు వినియోగదారులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం, ఇప్పటికే 70,000 బుకింగ్‌లు నమోదయ్యాయి. ఈ డిమాండ్‌ను చూస్తే, ఈ స్కూటర్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఎంత భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నదో స్పష్టమవుతుంది. దీన్ని డెలివరీలు 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


ప్రత్యేకంగా, విడుదలైన మొదటి రెండు వారాల్లోనే ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్సెరాక్ట్ 50,000కు పైగా బుకింగ్‌లను సాధించింది. ఇది ఏకంగా తొలి అర లక్ష బుకింగ్‌లకు రూ. 1.20 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఆ తర్వాత సంస్థ ఈ స్కూటర్ ధరను రూ.1.45 లక్షలకు పెంచింది. ఈ స్కూటర్‌లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి 3.5kWh బ్యాటరీ వేరియంట్. టెస్సెరాక్ట్ పలు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో లభించనుంది.

దీనిలో శక్తిమంతమైన వేరియంట్లు, ఎక్కువ రేంజ్ కలిగిన వెర్షన్లు కూడా ఉండే అవకాశముంది. ఈ అన్ని అంశాలను పరిశీలిస్తే, టెస్సెరాక్ట్ త్వరలోనే భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌ను మార్చే ఓ కీలక మోడల్‌గా నిలవబోతుందనటంలో సందేహమే లేదు. వినియోగదారులు ఇప్పటికే అడ్వాన్స్‌ చెల్లించి బుకింగ్ చేయడం, వచ్చే ఏడాది ప్రారంభంలో డెలివరీలు మొదలయ్యే వరకు ఎదురుచూడటానికి సిద్ధంగా ఉండటం ఇవన్నీ ఈ స్కూటర్‌పై నెలకొన్న నమ్మకాన్ని, అంచనాలను ప్రతిబింబిస్తాయి.

అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ 3.5kWh వేరియంట్ ధరను మాత్రమే ప్రకటించగా, అధిక శక్తితో వచ్చే 5kWh, 6kWh వేరియంట్‌ల ధరలను కంపెనీ త్వరలో వెల్లడించనుంది. అయితే, ఇవి ప్రారంభ మోడల్ కంటే మరింత ఖరీదుగా ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ స్కూటర్ టాప్ ఎండ్ వేరియంట్ ధర సుమారు రూ.2 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. పనితీరు పరంగా చూస్తే, ఇది గరిష్టంగా 20.10 bhp పవర్‌ను ఉత్పత్తి చేయగలదు.

దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 125 కి.మీ. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత ఇది 261 కి.మీ. వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. టెస్సెరాక్ట్ ప్రతి రైడర్‌కు వ్యక్తిగత స్టైల్‌కి అనుగుణంగా పింక్, నలుపు, ఇసుకతో సహా ఇతర కలర్ వేరియంట్స్‌లలో అందుబాటులో ఉంది. దీని డిజైన్ విషయానికి వస్తే, ముందు భాగంలో, ఆప్రాన్ మధ్యలో LED హెడ్‌ల్యాంప్‌లు, వాటి చుట్టూ ఉన్న ఫ్లోటింగ్ DRLలు ఆకర్షణీయంగా ఉంటుంది.

దీనిలో డ్యూయల్ LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు ఈ స్కూటర్‌కు ఖచ్చితంగా ఒక స్పోర్టీ, ఫ్యూచరిస్టిక్ లుక్స్ ఇస్తాయి. విండ్‌స్క్రీన్ డిజైన్ కూడా వేగాన్ని సూచించేలా ఉంటుంది. టెస్సెరాక్ట్ 34-లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ అందుబాటులో ఉంది, ఇది స్కూటర్ విభాగంలో చాలా అరుదైన అంశం. 14-అంగుళాల చక్రాలు, రైడింగ్ స్థిరత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఇది కేవలం నగర ప్రయాణాలకే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది.

దీనిలో అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. అల్ట్రావయోలెట్ టెస్సెరాక్ట్ ప్రపంచ స్థాయిలో మొట్టమొదటి మల్టీ-ఫీచర్ స్కూటర్‌గా గుర్తించబడుతోంది. ఇందులో ఆన్‌బోర్డ్ నావిగేషన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, ముందు, వెనుక రాడార్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కలిగిన అద్దాలు, స్మార్ట్ డాష్‌క్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఒక స్కూటర్‌లో ఉండే సాధారణ లక్షణాలు కాదన్నది ప్రత్యేకంగా చెప్పాలి. సేఫ్టీ కోసం కూడా పలు ఫీచర్స్ దీనిలో అందించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.