ఎగిరిగంతేసే గుడ్‌న్యూస్‌.. సగానికి సగం తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు! ఎప్పటినుంచంటే..?

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగే.. చాలా కాలంగా స్థిరంగా ఉన్నాయి. అయితే ఒక గుడ్‌ న్యూస్‌ ఏంటంటే.. ప్రస్తుతం ఉన్న ధరలు సగానికి సగం తగ్గుతాయని తెలుస్తుంది.


అమెరికన్ ఆర్థికవేత్త జె.పి.మోర్గాన్ ఈ అంచనా వేశారు. 2027 నాటికి బ్రెంట్ ముడి చమురు ధరలు 30 డాలర్లకు చేరుకోవచ్చని మోర్గాన్‌ అంచనా వేశారు. దీనికి కారణం చమురు సరఫరా డిమాండ్‌ను మించిపోవడమే. ఒక వేళ అదే జరిగితే భారత్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే భారతదేశం తన చమురు అవసరాలలో 85 శాతం కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది. దీనికి ప్రభుత్వం గణనీయమైన మొత్తాన్ని చెల్లించాలి. అందువల్ల ముడి చమురు ధరలను సగానికి తగ్గితే, మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా తగ్గుతాయి.

మోర్గాన్ ప్రకారం.. రాబోయే మూడు సంవత్సరాలలో చమురు వినియోగం పెరుగుతుంది. కానీ చమురు ఉత్పత్తి మరింత వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా OPEC +తో సహా ఇతర దేశాలు ముడి చమురు ఉత్పత్తిని పెంచుతాయి. ఈ పెరిగిన ఉత్పత్తి మార్కెట్లో అధిక డిమాండ్‌ను సృష్టిస్తుంది, దాంతో ధరలు తగ్గుతాయి. 2025లో ప్రపంచ చమురు డిమాండ్ రోజుకు 0.9 మిలియన్ బ్యారెళ్లు పెరుగుతుంది. దీని వలన మొత్తం వినియోగం 105.5 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుంది.

దీంతో సగటు ధరలు 2027 నాటికి 42 డాలర్లకు తగ్గవచ్చు. సంవత్సరం చివరి నాటికి 30 డాలర్ల కంటే తక్కువగా ఉండవచ్చు. ప్రస్తుతం బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 60 డాలర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఈ తగ్గింపు ప్రయోజనాలు చమురు కంపెనీలు సామాన్యులకు బదిలీ చేస్తాయని భావిస్తున్నారు. తత్ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రస్తుత స్థాయిల నుండి సగానికి తగ్గుతాయని నిపుణులు సైతం భావిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.