పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు

ఒంగోలు సత్యనారాయణపురంలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పిల్లర్ల దశలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో భాగంగా కొత్త భవనం నిర్మిస్తామని 2022లో పాత భవనాన్ని గత వైకాపా ప్రభుత్వం కూలగొట్టింది.


ఒంగోలు సత్యనారాయణపురంలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది. పిల్లర్ల దశలో ఉన్న భవనంలోనే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. నాడు-నేడు రెండో దశలో భాగంగా కొత్త భవనం నిర్మిస్తామని 2022లో పాత భవనాన్ని గత వైకాపా ప్రభుత్వం కూలగొట్టింది. అప్పటినుంచి ఓ ఏడాది అద్దె ఇంట్లో, తరువాత ఓ అపార్టుమెంట్‌ సెల్లార్‌లో తరగతులు నిర్వహించారు.

మరోవైపు 2023 ఆగస్టులో నాడు-నేడు నిబంధనలను ప్రభుత్వం మార్చడంతో పిల్లర్లు, స్లాబ్‌స్థాయిలోనే బడి నిర్మాణం నిలిచిపోయింది. గత్యంతరం లేక అందులోనే ఇప్పుడు తరగతులు నిర్వహిస్తున్నారు.

అంతా ఆరుబయటే కావడంతో కుర్చీలు, నల్లబల్లలను ఆకతాయిలు ధ్వంసం చేస్తున్నారు. దీంతో పిల్లర్లపైనే సుద్దముక్కతో రాసి బోధిస్తున్నారు. ఇక్కడ సుమారు 90 మంది పిల్లలు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. నిధుల కొరతతో పనులు నిలిచాయని, సమస్యను డీఈవో ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఎంఈవో కిశోర్‌బాబు వివరణ ఇచ్చారు.