పైనాపిల్ లో ఉండే బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహకరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మార్చి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. బ్రోమెలైన్ ఎంజైమ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.


































