Pink Salt Uses: హిమాలయ ఉప్పుతో హెల్త్ వండర్స్.. అస్సలు మిస్ చేయకండి!

www.mannamweb.com


వంటలకు అసలైన రుచి రావాలంటే అది ఉప్పుతోనే సాధ్యం. ఉప్పు లేకపోతే మీరు ఎంత బాగా వంట చేసినా ప్రయోజనం ఉండదు. అసలు ఉప్పు లేకుండా తినడం చాలా కష్టం. చేసే వంటకు ఉప్పుతోనే రుచి వస్తుంది.
అంతే కాకుండా ఉప్పు అనేది శరీరానికి కూడా చాలా మంచిది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఉప్పుతో సమస్యలు కూడా ఉన్నాయి. కానీ మితంగా తీసుకుంటే మాత్రం అద్భుతాలే అని నిపుణులు చెబుతున్నారు.

కళ్లు ఉప్పు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అందే విధంగా పింక్ సాల్ట్‌ కూడా చాలా మంచిదని.. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెబున్నారు. ఈ పింక్ సాల్ట్ అనేది లేత గులాబీ రంగులో ఉంటుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇది కేవలం హిమాలయ పరిసర ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా లభ్యమవుతుంది.

సముద్రపు ఉప్పు కంటే ఇది చాలా సురక్షితమైనంది. ఇందులో అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్ వంటివి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో ప్రజలు హిమాలయ పింక్ సాల్ట్‌నే ఉపయోగించేందుకే మొగ్గు చూపుతున్నారు.

పింక్ సాల్ట్ వాడటం వల్ల శరీరంలోని చెడు పదార్థాలు బయటకు పోతాయి. అంతే కాకుండా నీటి శాతం కూడా పెరుగుతుంది. సమ్మర్‌లో తీసుకునే పానీయాల్లో పింక్ సాల్ట్ కలుపుకుని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

రక్తం పోటును నియంత్రించడానికి, హార్మోన్ల స్థాయిని సమతూకంలో ఉంచడానికి, అరుగుదలకు ఈ పింక్ సాల్ట్ ఎంతో ఉపయోగ పడుతుంది. పింక్ సాల్ట్‌తో అందం కూడా పెరుగుతుంది. ఇది తీసుకోవడం వల్ల చర్మ కణాల మధ్య ఉన్న దుమ్ము, కాలుష్యం, బ్యాక్టీరియా వంటి వాటిని లోతుగా శుభ్రం చేసి.. చర్మాన్ని లోపల నుంచి మెరిసేలా చేస్తుంది.