PM Kisan: మహిళలకు ‘పీఎం కిసాన్‌’ సాయం డబుల్‌!

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు పీఎం కిసాన్‌ సాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందుతోంది.


– ప్రస్తుతం లబ్ధిదారులకు ఇస్తున్నది రూ.6 వేలు
– దీన్ని 10 వేలు లేదా 12 వేలకు పెంచే యోచన
– మిగతా రైతులకు రూ.8 వేలు.. కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ, జనవరి 13: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతులకు పీఎం కిసాన్‌ సాయాన్ని పెంచేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కసరత్తు చేస్తోంది. 2019 ఎన్నికలకు ముందు తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు ఏడాదికి రూ.6 వేలు అందుతోంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే మహిళా రైతులకు ఈ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వారికి రూ.10 వేలు లేదా 12 వేలు.. మిగతా రైతులకు రూ.8 వేలు లేదా రూ.9 వేలకు పెంచాలని యోచిస్తున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 1న సమర్పించే మధ్యంతర బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేయనున్నట్లు సమాచారం.