దేశంలో రైతన్నలకు పంట పెట్టుబడి సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధులను అందిస్తోంది. ఈ పథకం 21వ విడత నిధులను ఈనెల 19వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు.
2019 ఫిబ్రవరి 24న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించగా.. 11 కోట్ల మందికి పైగా రైతు కుటుంబాలు ఈ లబ్ధిని పొందుతున్నాయి. 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులు రైతుల ఖాతాల్లో జమచేసింది కేంద్రం. PM-KISAN పోర్టల్ లో వ్యవసాయ భూమి వివరాలు నమోదై, రైతు బ్యాంక్ అకౌంట్ ఆధార్ తో లింకై ఉంటే ఈ ప్రయోజనం పొందవచ్చు.



































