PM Kisan Yojana 2024 : పీఎం కిసాన్ యోజన.. ఇలా చేయకపోతే డబ్బులు పడవు!

www.mannamweb.com


PM Kisan Yojana 2024 : వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం అనేక ప్రయోజనకరమైన, సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి.
కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ యోజన ప్రయోజనం పొందుతున్నారు. అయితే పథకంయొక్క ప్రయోజనాలను పొందేందుకు రైతులు e-KYC, భూమి ధృవీకరణ పొందవలసి ఉంటుంది. ఒక రైతు ఈ-కేవీసీని పొందకపోతే అతనికి రావాల్సిన డబ్బులు మొత్తం నిలిచిపోతాయి. పథకం కోసం e-KYC చేసే ప్రక్రియ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.6000 అందజేస్తుంది.. ఈ మొత్తం విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుంది. ప్రభుత్వం ఏడాదిలో మూడు విడతలుగా ఈ పథకాన్ని విడుదల చేస్తుంది. ప్రతి విడతలో రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు వస్తాయి. ఇప్పటి వరకు 16వ విడత రైతుల ఖాతాల్లోకి చేరింది. ఇప్పుడు రైతులు 17వ విడత పీఎం కిసాన్ యోజన కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం అనేక నిబంధనలను కూడా రూపొందించింది. ఈ నిబంధనల ప్రకారం e-KYC చేసిన రైతులకు మాత్రమే పథకం ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పాత లేదా కొత్త అనే తేడా లేకుండా పథకం లబ్ధిదారులందరూ ఈ పని చేయడం చాలా అవసరం.

PM కిసాన్ యోజన e-KYC ప్రాసెస్ ఎలా చేయాలి..?

రైతులు తమ సమీప CSC కేంద్రాన్ని సందర్శించాలి.
తర్వాత బయోమెట్రిక్ ద్వారా సులభంగా e-KYC పూర్తి చేయవచ్చు.
అనేక బ్యాంకుల్లో PM కిసాన్ యోజన కోసం E-KYC అందుబాటులో ఉంది.
ఇది కాకుండా రైతు కావాలనుకుంటే అతను PM కిసాన్ పోర్టల్ (pmkisan.gov.in) ద్వారా సులభంగా ఈ-కేవీసీని పొందవచ్చు.
ఇందులో ఈ-కేవైసీ ఓటీపీ ద్వారా జరుగుతుంది.
ప్రభుత్వం ప్రారంభించిన PM కిసాన్ మొబైల్ యాప్ ద్వారా కూడా E-KYC సులభంగా చేయవచ్చు.