Vibrant Villages Program: దేశ ప్రజలకు నిజంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. కేంద్రంలోని మోదీ ( PM Modi) సర్కార్ మంచి ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు ఫ్రీగా 50వేల రూపాయలు పొందవచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ఆప్షన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే.
ప్రభుత్వ ఒక కాంటెస్ట్ నిర్వహిస్తోంది. దీనిపేరు వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్(Vibrant Villages Program). ఇందులో లోగో, ట్యాగ్ లైన్ డిజైన్ చేయాల్సి ఉంటుంది. మీ డిజైన్లు నచ్చినట్లయితే మీరే విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. దీంతో మీకు రూ. 50వేలు లభిస్తాయి. Vibrant Villages Program ప్రధాన లక్ష్యం ఏంటంటే అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో గుర్తించిన గ్రామాల సమగ్ర అభివ్రుద్ధి(Comprehensive development of villages). ఈ ప్రణాళిక ద్వారా అక్కడ నివసించే జీవన ప్రమాణాలను మెరుగుపరిచి వారు తమ స్వగ్రామాల్లోనే కొనసాగడానికి పోత్సహించడం ప్రధాన లక్ష్యం. ఈ ప్రోగ్రామ్ కింద పది ముఖ్యమైన అంశాలపై ఫోకస్ పెడుతుంది. ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, రోడ్ కనెక్టివిటీ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివ్రుద్ధి, పునరుత్పాదక ఇంధన వనరులు సోలార్, విండ్, పవర్ సహా ఎనర్జీ డెవలప్ మెంట్(Energy development, including power), టెలివిజన్ టెలికాం కనెక్టివిటీ(Television Telecom Connectivity) గ్రామాల్లో ఐటీ ఆధారిత కామన్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు వంటివి ఉన్నాయి.
ఇంకా పర్యావరణ పునరుద్ధరణ, పర్యాటక సాంస్క్రుతిక ప్రచారం, ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యత, నైపుణ్య అభివ్రుద్ధి స్వయం సమ్రుద్ధత , వ్యవసాయం, తోటల పెంపకం, ఔషధ మొక్కల సాగు వంటి ఉపాధి అవకాశాల నిర్వహణ కోసం సహకార సంఘాల అభివ్రుద్ధి వంటి ఉన్నాయి. కాగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మైగోవ్ తో కలిసి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్(Vibrant Villages Program) కోసం లోగో, ట్యాగ్ లైన్ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీ ద్వారా గ్రామాల అభివ్రుద్ధిలో ఈ ప్రణాళిక ప్రాముఖ్యతను సూచించే విధంగా లోగో, ట్యాగ్ లైన్ రూపొందించాల్సి ఉంటుంది.
వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్(Vibrant Villages Program) కోసం సమర్పించిన లోగో డిజైన్లు, ట్యాగ్ లైన్స్ కచ్చితమైన అంచనాలతో విశ్లేషిస్తారు. గెలుపొందిన లోగోను ఎంపిక చేసేందుకుభహోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మైగోవ్ ప్రతినిధులతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది. థీమ్ కు అనుగుణమైన ప్రోగ్రామ్ లక్ష్యాలకు తగిన విధంగా లోగో(logo), ట్యాగ్ లైన్(TagLine) కూడా ఉండాలి. క్రియేటివిటీ, వినూత్న ఆలోచన, కొత్తదనం, ప్రత్యేకతను చూపించాలి. సమర్పించిన డిజైన్ పూర్తిగా సొంతంగా ఉండాలి. అయితే కమిటీ తీసుకునే నిర్ణయమే ఫైనల్ అవుతుంది. ఈ కాంటెస్ట్ ఇప్పటికే ప్రారంభమైంది.ఇందులో మీరు కూడా పాల్గొనవచ్చు. మార్చి 12వ తేదీ వరకు ఎంట్రీస్ ఉంటుంది. గెలుపొందిన విజేతకు రూ. 50వేలు ఇస్తారు. మైగోవ్ వెబ్ సైట్లోకి వెళ్లి కాంటెస్ట్ లో పాల్గొనవచ్చు.