ఉపాధ్యాయుడికి ప్రధాని మోడీ ప్రశంసలు, ఎందుకంటే?

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఆదిలాబాద్‌కు చెందిన ఉపాధ్యాయుడు తొడసం కైలాష్.. ఏఐ టూల్ ద్వారా గిరిజన భాషల సంరక్షణకు చేస్తున్న కృషిని ప్రధాని మోడీ ప్రశంసించారు.


కృత్రిమ మేథ(AI) టెక్నాలజీని ఉపయోగించుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ మాట్లాడారు. పలు రంగాల్లో విలువైన సేవలను అందిస్తున్న వారికి ఆయన అభినందనలు, ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఏఐ సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వెళ్లినట్లు ప్రధాని మోడీ చెప్పారు. ఏఐలో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించిందని తెలిపారు.

తాజాగా, తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని సర్కాస్ స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయుడు తొడసం కైలాష్.. గిరిజన భాషలను పరిరక్షించడంలో తమకు సాయం చేశారని ప్రధాని మోడీ చెప్పారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కంపోజ్ చేశారని ప్రధాని తెలిపారు.