PMEGP కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకం. స్వయం ఉపాధి కల్పనలో భాగంగా bank ల నుంచి సబ్సిడీకి రుణాలు అందిస్తారు.
ప్రధానమంత్రి రోజ్‌గర్ యోజన (PMRY) , గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమం (REGP) ఈ రెండు పథకాలను కలిపి ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ (PMEGP Scheme) అమలు చేస్తున్నారు.
వ్యవసాయేతర రంగంలోని సూక్ష్మ వ్యాపార సంస్థల ద్వారా నిరుద్యోగ యువత, చేతివృత్తుల వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ KVIC అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది.
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమీషన్ KVIC ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా ఉంది. ఈ పథకం కింద, రూ. 5 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు రుణాలు 15 శాతం నుండి 35 శాతం సబ్సిడీతో అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో, ఈ పథకం రాష్ట్ర KVIC డైరెక్టరేట్లు, జిల్లా పరిశ్రమల కేంద్రాలు, రాష్ట్ర ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల బోర్డులు… బ్యాంకుల ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం, KVIC ప్రభుత్వ సబ్సిడీతో బ్యాంకుల లబ్ధిదారులకు రుణాలను కింద అందిస్తుంది.
అర్హతలు
18Yrs కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు.
స్వయం ఉపాధి ప్రాజెక్టులను బట్టి కనీసం 8th Class పాస్ అయి ఉండాలి. ప్రాజెక్టు విలువ తయారీ రంగంలో రూ.10 Lakhs కంటే ఎక్కువ, బిజినెస్ లేదా సేవా రంగంలో రూ. 5 Lakhs కంటే ఎక్కువ ఉండాలి. ఈ పథకాన్ని కొత్త ప్రాజెక్టుల మంజూరు కోసం పరిగణిస్తారు. స్వయం సహాయక బృందాలు(SHG), సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం-1860 కింద నమోదైన సంస్థలు, ఉత్పత్తి ఆధారిత సహకార సంఘాలు, ఛారిటబుల్ ట్రస్ట్‌లు అర్హులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏదైనా ఇతర పథకాల తో ఇప్పటికే ప్రభుత్వ సబ్సిడీని పొందిన యూనిట్ల వారు అనర్హులు.
మాన్యుఫాక్చరింగ్ రంగంలో ప్రాజెక్ట్ లేదా యూనిట్ గరిష్ట వ్యయం రూ.25 లాక్స్ , బిజినెస్ లేదా సేవా రంగంలో గరిష్టంగా రూ.10 లాక్స్ వరకు లోన్స్ పొందవచ్చు. జనరల్ కేటగిరీ లబ్ధిదారులకు పట్టణ ప్రాంతాల్లో 15%, గ్రామీణ ప్రాంతాల్లో 25% సబ్సిడీ లోన్స్ ఇస్తారు. ఇతర కేటగిరీ లబ్ధిదారులకు(ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఇతరలు) పట్టణ ప్రాంతాల్లో 25%, గ్రామీణ ప్రాంతాల్లో 35% సబ్సిడీకి రుణాలు అందిస్తారు.
PMEGP అప్లై విధానం
1. అర్హత- దరఖాస్తు చేయడానికి ముందు, ప్రభుత్వ పథకాల పోర్టల్ జన్ సమర్థ్ పోర్టల్‌ని ఉపయోగించి మీ అర్హతను ధృవీకరించండి. PMEGP లోన్ కోసం మీ అర్హతను అంచనా వేయడానికి వ్యాపారం, విద్యా అర్హతలు వంటి ప్రాథమిక వివరాలను ఇందులో ఎంటర్ చేయండి.
2. ప్రాజెక్ట్ ఖర్చు, లోన్ అంచనా వేయండి – ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు, దానికి మీరు ఎంత సహాకారం కావాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోండి . మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ.25 లాక్స్ అయితే, మీరు రూ.10 లాక్స్ ఏర్పాటు చేసుకోగలగితే ఆ వివరాలు ముందుగా నమోదు చేసుకోండి.
-ముందుగా “Application For New Unit” పై క్లిక్ చేసి మీ ఆధార్ వివరాలను Enter చేయండి.
– వ్యక్తిగత, వ్యాపార సమాచారాన్ని ఎంటర్ చేయండి.
-స్పాన్సరింగ్ ఏజెన్సీని ఎంచుకోండి -KVIC, KVIB లేదా DIC
– మీ ప్రాథమిక వివరాలను రిజిస్టర్ చేయండి
– మీ వ్యాపారం మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ లేదా బిజినెస్ ఎంపిక చేయండి.
– మీరు ఏ రకమైన ఉత్పత్తులను తయారు చేస్తారో లేదా విక్రయిస్తారో తెలపాలి .
4. శిక్షణ – మీ ఋణం మంజూరైన తర్వాత ఎంటర్‌ప్రెన్యూరియల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (EDP) శిక్షణకు తప్పనిసరిగా హాజరవ్వాలి. ఈ శిక్షణ మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో హెల్ప్ అవుతుంది . మీ ప్రాజెక్ట్ ధర రూ.2 లక్షల కంటే తక్కువగా ఉంటే ఈడీపీ శిక్షణ అవసరం లేదు.
5. వ్యాపార ఖర్చులు, బ్యాంక్ వివరాలను నమోదు చేయండి.
6. వివరాలన్నీ పూర్తి చేసి దరఖాస్తును సబ్మిట్ చేయండి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ నెంబర్, పాస్ వర్డ్ భద్రపరుచుకోండి. పాస్‌పోర్ట్ ఫొటోలు, ప్రాజెక్ట్ రిపోర్ట్, సర్టిఫికేట్‌లతో సహా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
7. స్కోరింగ్ ప్రక్రియ – మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, ఇంటి యాజమాన్యం, అర్హతలు, అనుభవం వంటి అంశాలు దరఖాస్తులో నమోదు చేయండి. 60 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్‌ను సాధించడం అప్లికేషన్ ఆమోదం పొందే అవకాశాలు పెరుగుతాయి.
8. అప్లికేషన్ ఆమోదం, తదుపరి దశలు – మీ దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత…వివరాలు సమీపంలోని KVIB లేదా మరొక ఏజెన్సీకి ఫార్వార్డ్ చేస్తారు. మీ ఖాతాకు నిధులు పంపిణీ చేయడానికి ముందు మీరు ఈడీపీ శిక్షణను పూర్తి చేయాల్సి ఉంటుంది.