Pradhan Mantri Vishwa Karma Yojana:రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రెండూ వాటి స్థాయిలలో అనేక ప్రయోజనకరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. అనేక పథకాల ద్వారా అర్హులైన ప్రజలకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయి.
అలాంటి పథకాల్లో ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన(Pradhan Mantri Vishwa Karma Yojana) ఒకటి. ఈ పథకం కింద అర్హులైన వారికి ఆర్థిక సాయం అందిస్తారు. మీరు కూడా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేస్తున్నారా? అయితే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో మీకు అవసరమైన డాక్యుమెంట్ల గురించి తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే అడిగిన పత్రాలను సబ్మిట్ చేయకపోతే మీ దరఖాస్తు నిలిచిపోతుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటో మేం మీకు చెప్పబోతున్నాం..!
ఈ డాక్యుమెంట్స్ అవసరం:
–> ఆధార్ కార్డ్(Aadhaar Card).
–> అడ్రస్ ప్రూఫ్.
–> కుల ధృవీకరణ పత్రాన్ని కూడా అందించాలి.
–> దరఖాస్తుదారు తన నివాస ధృవీకరణ పత్రాన్ని చూపించాలి.
–> దరఖాస్తు సమయంలో మీరు మీ బ్యాంక్ ఖాతా(Bank Account) సమాచారాన్ని కూడా అందించాలి.
–> మీ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, యాక్టివ్ మొబైల్ నంబర్(Active Mobile Number)ను కూడా అందించాలి.
ఒరిజినల్ కాపీలు అవసరమని గుర్తుంచుకోగలరు:
ప్రయోజనాలేంటి?
–> మీరు పథకంలో చేరినట్లయితే మీకు రోజుకు రూ.500 స్టైఫండ్ ఇస్తారు.
–> టూల్‌కిట్‌ను కొనుగోలు చేయడానికి మీకు రూ. 15,000 ఇస్తారు.
–> రూ.లక్ష రుణం, ఆపై రూ.2 లక్షల అదనపు రుణం.. గ్యారెంటీ లేకుండా, చౌక వడ్డీ రేటుకు ఇస్తారు.