ఈ కామర్స్ సంస్థలు స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్స్ ప్రకటించడం సర్వసాధారణమైన విషయం. అయితే మొన్నటి వరకు కేవలం ప్రత్యేకంగా సేల్స్ ఉన్న సమయంలోనే డిస్కౌంట్స్ అందించే వారు.
కానీ ప్రస్తుతం సేల్స్‌తో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్‌లపై డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్‌పై మంచి డిస్కౌంట్ అందిస్తోంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్‌గా చెప్పొచ్చు.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకోకు చెందిన ఫోన్‌పై ఈ డస్కౌంట్ లభిస్తోంది. పోకో సీ65 స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఊహకందని డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 38 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. పోకోసీ65 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.10,999కాగా 38 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 6,799కే సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ఇక ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్‌తో కొనుగోలు చేస్తే అదనంగా 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను రూ. 6వేలలోనే పొందొచ్చు. అలాగే ఫ్లిప్‌కార్ట్ యూపీఐ ఫస్ట్ పేమెంట్ చేస్తే రూ. 50 డిస్కౌంట్ పొందొచ్చు.
అయితే ధర తక్కువ అని ఫీచర్ల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదు. పోకో సీ65లో మంచి ఫీచర్లను అందించారు. ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. 1650*720 రిజల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్రాస్ 3ని అందించారు. ఈ ఫోన్‌లో మీడియో టెక్ హీలియో జి 85 ప్రోసెసర్‌ను అందిచారు.
కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇక ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో బ్లూటూత్, డ్యూయల్ బాండ్ వైఫై, యూఎస్‌బి టైప్ సి పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు. 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌క సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.