ఈ స్మార్ట్ ఫోన్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం మేరకు ఈ ఫోన్‌లో ఉండనున్న ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లీక్స్ ఆధారంగా…
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారతమార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. పోకో ఎక్స్6 నియో పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకురానున్నారు. పోకో నుంచి ఇప్పటికే వచ్చిన పోకో ఎక్స్6, పోకో ఎక్స్ ప్రోలో కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకురానున్నారు.ఈ స్మార్ట్ ఫోన్‌ను రెడ్‌మీనోట్ 13ఆర్ ప్రో స్మార్ట్ ఫోన్‌కు రీబ్రాండెడ్‌గా లాంచ్ చేయనున్నారు.
ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్‌ను వచ్చే నెలలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం మేరకు ఈ ఫోన్‌లో ఉండనున్న ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లీక్స్ ఆధారంగా ఈ స్మార్ట్ ఫోణ్లో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్‌రేట్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు.
ఇక పోకో ఎక్స్6 నియో స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఇక 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. ఇక ఈ ఫోన్‌లో ఐపీ54 రేట్ డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్స్‌ను ఇవ్వనున్నారు. ఇక 3.5 ఎమ్‌ఎమ్ ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్‌ను ఇవ్వనున్నారు.
ఇక రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రోకి రీబ్రాండ్‌గా రానున్నట్లు తెలుస్తోన్న ఈ ఫోన్‌లో అచ్చం రెడ్‌మీ నోట్ 13ఆర్ ప్రో ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. రెడ్‌మీ మోడల్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక ధర విషయానికొస్తే రెడ్‌మీన నోట్ 13 ప్రో ఆర్ ఫోన్‌ను రూ. 23,000గా నిర్ణయించారు. మరి పోకో ఎక్స్6 నియోలో ఎలాంటి ఫీచర్స్ ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.