108 MP కెమెరా గల POCO X6 Neo ఫోన్ పై కళ్ళు చెదిరే డిస్కౌంట్.. త్వరపడండి

www.mannamweb.com


ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ దిమ్మ తిరిగే ఆఫర్లతో నడుస్తుంది. ఈ సేల్ లో POCO X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపుతో వస్తుంది. ఇక దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. Poco X6 నియో 5G స్మార్ట్‌ఫోన్ పై 35 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ కేవలం రూ. 12,999 ధరకే వస్తుంది. ఇక బ్యాంకు కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే ఏకంగా రూ.1299 తగ్గింపు కూడా లభిస్తుంది. దీంతో ఈ ఫోన్‌ను కేవలం రూ.11,700 ధరతో కొనుగోలు చేయవచ్చు.

Poco X6 నియో 5G ఫోన్ పవర్ ఫుల్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6080 6nm చిప్‌సెట్‌ కలిగి ఉంటుంది. ఇది 6.67-అంగుళాల ఫుల్ HD ప్లస్ (FHD+) సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే దీని డిస్ప్లే (1080×2400 పిక్సెల్స్) రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఇంకా 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగి ఉంటుంది. 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ వంటి సూపర్ ఫీచర్లను ఈ ఫోన్ డిస్ప్లే కలిగి ఉంది. అలాగే మిడ్-ప్రీమియం డిస్‌ప్లే అవుట్‌పుట్‌ కూడా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Android 13 OS MIUI 14తో పని చేస్తుంది.

Poco X6 నియో స్మార్ట్‌ఫోన్‌లో ఆకట్టుకునే ఫీచర్ ఏంటంటే దీని కెమెరా. దీనికి ఏకంగా 108 MP ప్రో గ్రేడ్ మెయిన్ కెమెరా + 2 MP డెప్త్ కెమెరా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, వాయిస్ షట్టర్, ఫిల్మ్ ఫిల్టర్‌లు, 3x ఇన్-సెన్సార్ జూమింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.సెల్ఫీలు దిగడానికి, వీడియో కాల్స్ చేసుకోవడానికి ఈ స్మార్ట్ ఫోన్‌లో 16MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 8GB ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. అదనంగా దీన్ని మైక్రో SD కార్డ్ ద్వారా ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు.ఇంకా ఈ ఫోన్ 5000mAh పవర్ ఫుల్ బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ ఉంటుంది. ఇందులో ఇన్‌ఫ్రారెడ్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ ఇంకా మార్టిన్ ఆరెంజ్ రంగులలో వస్తుంది. సూపర్ ఫీచర్లతో తక్కువ ధరలో ఫోన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.