పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు.. అప్లయ్ చేసుకోండి..

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB ) సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లాబొరేటరీ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 15.

పోస్టులు: 60.

విభాగాలు: సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజికల్/ జనరల్) 02, సైంటిఫిక్ ఆఫీసర్ (కెమికల్) 03, సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజీ/ సెరోలజీ) 03, సైంటిఫిక్ ఆఫీసర్( కంప్యూటర్స్) 02, సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్/ జనరల్) 05, సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమికల్) 10, సైంటిఫిక్ అసిస్టెంట్(బయాలజీ/ సెరోలజీ) 10, సైంటిఫిక్ అసిస్టెంట్ (కంప్యూటర్స్) 07, లాబొరేటరీ టెక్నీషియన్ (ఫిజికల్/ జనరల్) 02, లాబొరేటరీ టెక్నీషియన్ (కెమికల్) 06, లాబొరేటరీ టెక్నీషియన్ (బయాలజీ/ సెరోలజీ) 04, లాబొరేటరీ టెక్నీషియన్ (కంప్యూటర్స్) 05, లాబొరేటరీ అటెండెంట్ 01.

ఎలిజిబిలిటీ: పోస్టులను అనుసరించి సంబంధి విభాగంలో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, ఎం.టెక్/ ఎంఈ, బీసీఏ, బీఎస్సీ, 12వ తరగతి, ఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం తప్పనిసరి.

వయోపరిమితి: 18 నుంచి 34 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 27.

అప్లికేషన్ ఫీజు:
సైంటిఫిక్ ఆఫీసర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్స్: ఎస్సీ, ఎస్టీ లోకల్ (తెలంగాణ) రూ.1000, ఇతరులకు రూ.2000.
సైంటిఫిక్ అసిస్టెంట్స్: ఎస్సీ, ఎస్టీ లోకల్ (తెలంగాణ) రూ.600, ఇతరులకు రూ.1200.
లాబొరేటరీ అటెండెంట్: ఎస్సీ, ఎస్టీ లోకల్ (తెలంగాణ) రూ.500, ఇతరులకు రూ.1000.
లాస్ట్ డేట్: డిసెంబర్ 15.

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్​లో సాధించి మార్కులు, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అకడమిక్ మార్కులకు 70 శాతం వెయిటేజీ, రాత పరీక్షకు 30 శాతం మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో అర్హత సాధించడానికి అభ్యర్థులు పొందాల్సిన కనీస అర్హత మార్కులు ఈడబ్ల్యూఎస్​, ఓసీలకు 40 శాతం, బీసీలకు35 శాతం, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

పూర్తి వివరాలకు tgprb.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.