Post Office FD: పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌తో మంచి వడ్డీ.. ఐదేళ్లకు ఎంత రాబడి వస్తుందంటే..

www.mannamweb.com


Post Office FD: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే స్థిరత్వం, భద్రత కారణంగా ఎక్కువ మంది పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. రిస్కు తక్కువగా ఉండటం, రిటర్న్స్‌కి కేంద్ర ప్రభుత్వ హామీ ఉండటంతో కొన్ని సంవత్సరాలుగా పోస్టాఫీసు సేవింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లు పాపులర్‌ అయ్యాయి. అయితే బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగానే, పోస్టాఫీసులు స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్స్ అందిస్తున్నాయి. ఇవి ఇప్పుడు పాపులర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆప్షన్‌గా మారాయి.

కొత్త ఆర్థిక సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైనందున, పన్నులను ఆదా చేయడానికి, మెరుగైన రాబడిని పొందడానికి సంవత్సరం ప్రారంభం నుంచే వివిధ పోస్ట్-ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో ఐదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే, ఎంత రాబడి అందుతుందో తెలుసుకోండి.

పోస్టాఫీస్‌లో వన్‌ ఇయర్‌, టూ ఇయర్స్, త్రీ ఇయర్స్‌, ఫైవ్‌ ఇయర్స్‌ వంటి విభిన్న టెన్యూర్‌లతో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ మద్దతుతో, గ్యారెంటీడ్‌ రిటర్న్స్‌ అందిస్తాయి. అయితే ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C ప్రకారం ఈ స్కీమ్స్ అన్నీ రూ.1.50 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ అందించవు. కేవలం ఐదేళ్ల FD మాత్రమే డిపాజిట్లపై రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇతర టెన్యూర్స్‌కు చేసే ఎఫ్‌డీలతో ఎలాంటి పన్ను ప్రయోజనాలు ఉండవు

* పోస్టల్ ఎఫ్‌డీ ప్రత్యేకతలు

పోస్టాఫీసు ఫిక్స్‌డ్ డిపాజిట్ పేర్కొన్న పదవీకాలం పూర్తయిన తర్వాత మీ పెట్టుబడిపై ఫిక్స్‌డ్‌ రిటర్న్‌ అందిస్తుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ మెచ్యూర్ అయినప్పుడు, మీరు పెట్టుబడి సమయంలో ఇచ్చిన అసలు మొత్తం, వడ్డీ సహా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. పోస్టాఫీస్‌ ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, ఐదు సంవత్సరాల వంటి వివిధ టెన్యూర్స్‌లో ఫిక్స్డ్‌ డిపాజిట్‌ ఆప్షన్‌లు అందిస్తోంది.

ఐదు సంవత్సరాల పోస్టాఫీసు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, 7.5 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. వడ్డీ రేటును యాన్యువల్లీ చెల్లిస్తుంది, కానీ త్రైమాసికం ప్రాదిపదికన కాలిక్యులేట్‌ అవుతుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో ఒక వ్యక్తి కనీసం రూ.1,000 డిపాజిట్‌ చేయాలి. గరిష్ట పరిమితి ఉండదు. రూ.100 మల్టిపుల్స్‌లో ఎంత డబ్బు అయినా పెట్టుబడి పెట్టవచ్చు. మైనర్ తరఫున గార్డియన్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. ఐదేళ్ల ఎఫ్‌డీ స్కీమ్‌ మెచ్యూరిటీ 18 నెలల కాలానికి కూడా పొడిగించవచ్చు.

* ఐదేళ్ల పోస్టల్ ఎఫ్‌డీలపై రాబడి

ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే మొత్తాన్ని బట్టి వడ్డీ రేటు మారుతుంది. ఐదేళ్ల పోస్టాఫీసు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకంలో రూ.3 లక్షల పెట్టుబడికి, రూ.1,34,984 వడ్డీని పొందవచ్చు, మెచ్యూరిటీ మొత్తం రూ. 4,34,984 అవుతుంది. ఇదే స్కీమ్‌లో రూ.5 లక్షల పెట్టుబడికి, రూ. 2,24,974 వడ్డీని పొందవచ్చు, మెచ్యూరిటీ మొత్తం రూ. 7,24,974 అవుతుంది. ఇన్వెస్టర్ రూ.10 లక్షల పెట్టుబడికి, రూ. 4,49,948 వడ్డీ పొందవచ్చు, మెచ్యూరిటీ మొత్తం రూ. 14,49,948 అవుతుంది. అంటే ఇన్వెస్టర్లు ఈ స్కీమ్‌తో భారీగానే లాభాలు అందుకోవచ్చు.