10వ తరగతితో పోస్టాఫీస్ జాబ్స్.. రోజుకు నాలుగు గంటలే పని.. ఏకంగా 30 వేలు?

www.mannamweb.com


వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ సిద్ధమవుతోంది. గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఉద్యోగాల భర్తీకి పోస్టల్ డిపార్ట్‌మెంట్ రెడీ అవుతోందని సమాచారం.

ఈ ఏడాదికి సంబంధించిన నోటిఫికేషన్‌ ఇప్పటికే విదుల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల బ్రేక్‌ పడింది. గతేడాది India Post GDS Recruitment ద్వారా జనవరిలో 40వేల ఖాళీలకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఇదే బాటలో ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో జాబ్ నోటిఫికేషన్ సిద్ధం చేస్తున్నారట.

ఈ సారి 30 వేల పోస్టుల భర్తీ చేపట్టనున్నారట. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే ఈ నియామకాలు జరుగుతాయి. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ జాబ్‌కి ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (BPM), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ABPM), డాక్‌ సేవక్‌ హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేసి.. రీజియన్ల వారీగా ఖాళీలు, ముఖ్యమైన తేదీల వివరాలు తెలియజేస్తారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో సెలెక్ట్ అయిన వారికి పోస్టును బట్టి రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.