Post Office Scheme: అధిక వడ్డీని అందించే పోస్ట్ ఆఫీస్ పథకం ఎలా దరఖాస్తు చేయాలి?

‘మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ (MSSC) అనేది కేంద్ర ప్రభుత్వం మహిళలు మరియు బాలికల కోసం అందించే పథకాలలో ఒకటి. ఈ పథకాన్ని జూన్ 27, 2023న కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఇది ఈ నెలాఖరు నాటికి ముగియనుంది. కాబట్టి ఈ పథకానికి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.


MSSC పథకానికి ఎవరు అర్హులు

  1. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు భారతీయులై ఉండాలి.
  2. ఈ పథకం మహిళలకు మాత్రమే.
  3. మీరు ఈ పథకానికి వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది మైనర్ ఖాతా అయితే, తండ్రి / సంరక్షకుడు దీన్ని తెరవవచ్చు.
  4. ఎక్కువ వయోపరిమితి లేదు, కాబట్టి ఏ స్త్రీ అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు.. సమీపంలోని పోస్టాఫీసు శాఖ లేదా ఈ సౌకర్యం ఉన్న బ్యాంకులో దరఖాస్తు చేసుకోవాలి.
  • ముందుగా, అధికారిక వెబ్‌సైట్ నుండి ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అవసరమైన వివరాలను పూరించండి.. ఆపై అవసరమైన పత్రాలను జత చేయండి.
  • జమ చేయవలసిన మొత్తాన్ని దరఖాస్తులోనే వెల్లడించాలి (రూ. 1000 నుండి రూ. 2 లక్షలు).

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డిపాజిట్ చేయవలసిన మొత్తం లేదా చెక్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, చిరునామా రుజువు కోసం ఓటరు ఐడి వంటి పత్రాలు అవసరం.

ఎంత పెట్టుబడి పెట్టాలి? మీకు ఎంత వడ్డీ వస్తుంది

మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకంలో, మీరు రూ. 1000 నుండి రూ. 2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం యొక్క కాలపరిమితి రెండు సంవత్సరాలు. వడ్డీ రేటు 7.5 శాతం. అంటే, మీరు ఇప్పుడు ఈ పథకం కింద పెట్టుబడి పెడితే.

రెండేళ్ల తర్వాత, మీరు అసలు మరియు వడ్డీని కలిపి ఉపసంహరించుకోవచ్చు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో, మీరు డిపాజిట్ మొత్తంలో 40 శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు. మీరు ముందుగానే ఉపసంహరించుకుంటే, వడ్డీ రేటు తగ్గించబడవచ్చు.