Postal Ballot : పోస్టల్ బాలట్ ద్వారా ఓటు వేయు విధానం.. ఇలా అయితే ఇన్వాలిడ్ చేస్తారు…. పూర్తి వివరాలు

Oplus_131072

www.mannamweb.com


పోస్టల్ బ్యాలట్ లెక్కేంచేటప్పుడు ఈ క్రింది విషయాలు పరిగణనలోకి తీసుకొని పోస్టల్ బ్యాలట్ invalid చేస్తారు.

1.Form 13A డిక్లరేషన్ లో అసెంబ్లీ / పార్లమెంట్ పేర్లు వ్రాసారా, లేదా.

2 అదే Form 13A లో మీకు ఇచ్చిన పోస్టల్ బ్యాలట్ సీరియల్ నెంబర్ ఖాళీ లో పూరించారా లేదా.

3.Form 13 A లో పోస్టల్ బ్యాలట్ వేసే వ్యక్తి సంతకం చేసి, అడ్రస్ వ్రాసారా? లేదా?

4.అదే Form 13A డిక్లరేషన్ లో గెజిటెడ్ సంతకం ఉన్నదా? లేదా.
గెజిటెడ్ సంతకం క్రింద స్టాంప్ ఉన్నదా? లేదా తప్పనిసరిగా చూస్తారు అవి లేకపోతే మన పోస్టల్ బ్యాలట్ invalid చేస్తారు.

5.బ్యాలట్ పేపర్ లో మనకు నచ్చిన వారికి ఓటు మార్క్ చేసిన తరువాత ఆ బ్యాలట్ పేపర్ ను తగిన రీతిలో మడత పెట్టి inner కవర్ “A” లో ఉంచి కవరు అతికించాలి. మరియు కవరు పైన వివరాలు పూరించి తప్పనిసరిగా బ్యాలట్ సీరియల్ నెంబర్ కవరు పైన కూడా వేయాలి. అక్కడ బ్యాలట్ సీరియల్ నెంబర్ వేయకపోతే మీ ఓటు invalid అయినట్లే.
6.ఇప్పుడు డిక్లరేషన్ (Form 13A), మరియు inner”A”.బ్యాలట్ ఉంచి అతికించిన కవరు ఈ రెండు కలిపి outer cover “B” ( Form 13 C) లో ఉంచి outer cover”B” అతికించాలి.outer cover పైన వివరాలు పూర్తి చేసి signature of the voter అని ఉన్నచోట తప్పనిసరిగా సంతకం చేయాలి.

***
పోస్టల్ బ్యాలట్ లెక్కించేటపుడు
1. డిక్లరేషన్ పై assembly/పార్లమెంట్ వ్రాసారా, లేదా
2. బ్యాలట్ సీరియల్ నెంబర్ ఉన్నదా, లేదా
3. గెజిటెడ్ signature ఉన్నదా లేదా
4. బ్యాలట్ పేపర్ లో సరిగా tick/cross మార్క్ సరిగా గుర్తించారా, లేదా
5. బ్యాలట్ పేపర్ ఉంచిన inner “A” cover పైన బ్యాలట్ సీరియల్ నెంబర్ వేసారా, లేదా
6. డిక్లరేషన్ (Form 13A), inner “A” (Form 13B బ్యాలట్ ఉంచిన కవర్ ) ఈ రెండు outer cover”B” నందు ఉంచి outer కవర్ “B” పైన signature of the voter అన్న చోట సంతకం ఉందా, లేదా అని చూసి అన్ని సక్రమంగా ఉంటే మీ పోస్టల్ బ్యాలట్ లెక్కింపు లోనికి వెళుతుంది. ఇందులో చెప్పిన ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మీ పోస్టల్ బ్యాలట్ invalid అవుతుంది.

కావున ఫ్రెండ్స్

మనం వేసే పోస్టల్ బ్యాలట్ సద్వినియోగం అయ్యే విధంగా అందరు తగుజాగ్రత్తలు తీసుకొని, పోస్టల్ బ్యాలట్ invalid కాకుండా ఉండాలని కోరుతున్నాము.