టాలీవుడ్ రిచెస్ట్ హీరోల్లో ఒకరికి మత్తు వదిలించిన ప్రభాస్.

టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవాలంటే ఎలాంటి హీరో అయినా కష్టపడాల్సిందే. బలమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కస్టపడి నిరూపించుకుంటేనే లాంగ్ కెరీర్ ఉంటుంది.


టాలీవుడ్ లో హీరోగా నిలదొక్కుకోవాలంటే ఎలాంటి హీరో అయినా కష్టపడాల్సిందే. బలమైన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కస్టపడి నిరూపించుకుంటేనే లాంగ్ కెరీర్ ఉంటుంది. సులభంగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ మధ్యలోనే కెరీర్ ముగించిన వాళ్ళు చాలా మందే ఉన్నారు.

హీరో శర్వానంద్ విషయానికి వస్తే.. అతడికి సినీ బ్యాగ్రౌండ్ లేదు. కానీ తల్లిదండ్రులు బాగా ధనవంతులు. టాలీవుడ్ లో రిచెస్ట్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. శర్వానంద్ తలుచుకుంటే సగం హైదరాబాద్ ని కొనేయగలడు అంటూ సన్నిహితులు సరదాగా చెబుతుంటారు. అయినప్పటికీ శర్వానంద్ ఇండస్ట్రీలో సొంతంగా నిరూపించుకునేందుకు చాలా కష్టాలు పడ్డారట.

వరుసగా తాను నటించిన చిత్రాలు ఫ్లాప్ అవుతున్న తరుణంలో తాను పునరాలోచనలో పడ్డానని శర్వానంద్ తెలిపాడు. అసలు నేను ఎలాంటి సినిమాలు చేస్తున్నాను ? ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి ? అని ఆలోచించడం మొదలు పెట్టాడట. సొంత ప్రొడక్షన్ లో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు. దీనితో తన తల్లి దగ్గర బంగారం తీసుకుని తాకట్టు పెట్టాడు. ఆ డబ్బు సరిపోకపోవడంతో ఫ్రెండ్స్ దగ్గర కోట్లల్లో అప్పు చేశాడు. ఆ డబ్బుతో నిర్మించిన చిత్రమే కో అంటే కోటి.

ఆ మూవీ దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. దీనితో శర్వానంద్ పెట్టిన డబ్బంతా పోయింది. తల్లి నగలు తాకట్టులో చిక్కుకుపోయాయి. ఫ్రెండ్స్ దగ్గర అప్పు ఎక్కువైపోయింది. దీనితో చాలా మంది ఫ్రెండ్స్ తనకి దూరమయ్యారట. డబ్బు ఇంత పని చేస్తుందా అని శర్వానంద్ షాక్ అయ్యాడట. అప్పటి నుంచి కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెట్టాను. పది మందికి కథ వినిపించి ఒపీనియన్ తీసుకునేవాడిని అని శర్వానంద్ పేర్కొన్నాడు

ఆ అప్పు తీర్చడానికి నాకు 6 ఏళ్ళ టైం పట్టింది. ఆ ఆరేళ్లపాటు కనీసం ఒక్క షర్ట్ కూడా కొనుక్కోలేదని అంత కఠినంగా బతికానని శర్వానంద్ తెలిపాడు. చివరికి రన్ రాజా రన్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నా. అప్పటికి అప్పు ఇంకా తీరలేదు. ఆ బాధలో రన్ రాజా రన్ సక్సెస్ ఐ ఎంజాయ్ చేయలేకపోయా అని శర్వానంద్ తెలిపారు. కానీ మా చిత్ర యూనిట్ ని ప్రభాస్ అన్న పార్టీ ఇచ్చారు. ఆ పార్టీలో కూడా డల్ గా కూర్చున్నా. అప్పుడు ప్రభాస్ అన్న నా మత్తు వదిలించారు. నువ్వు హిట్ కొట్టావు.. ఇది సంతోషంగా ఉండాల్సిన టైం అని చెప్పాడు అంటూ శర్వానంద్ అప్పటి సంగతులు గుర్తు చేసుకున్నారు.