రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’.ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి సరికొత్త రికార్డులను సృష్టంచిన విషయం తెలిసిందే. మరీ, అంత అద్భుతంగా ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ఇకపోతే ఈ సినిమా రిలీజైన నాటి నుంచి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోడమే కాకుండా.. కమర్షియల్ పరంగా కూడా బాక్సాఫీస్ వద్ద షేక్ చేసింది. ముఖ్యంగా కల్కి మూవీ రిలీజైన సమాయానికి థియేటర్లలోకి కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో.. ఇటు ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులుకూడా కల్కి సినిమా కోసం థియేటర్లకు ఎగబడ్డారు. ఈ క్రమంలోనే.. కల్కి సినిమా సింగల్ స్క్రీన్స్ దగ్గర నుంచి మల్టీప్లెక్స్ వరకు అద్భుతమైన ఆక్యుపెన్సీతో దూసుకుపోయింది. అంతేకాకుండా.. కల్కి రిలీజై నెల రోజులు గడవకముందే రూ.1000 కోట్ల క్లబ్ లోకి చేరుకుంది. అయితే తాజాగా కల్కి మూవీ రూ.1100 కోట్ల క్లబ్ కు చేరినట్లు మూవీ టీమ్ అధికరకంగా ప్రకటించారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ఇటీవలే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ కల్కి ‘కల్కి 2898 ఎడి’. ఇక ఈ మూవీలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్, దిశా పటానీ, శోభన, పశుపతి, రాజేంద్ర ప్రసాద్, అన్నా బెన్, మాళవిక నాయర్ వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, అనుదీప్, ఫరియా అబ్దుల్లా అతిథి పాత్రల్లో మెరిశారు. ఇక కల్కి సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. ఇదిలా ఉంటే..కల్కి సినిమా థియేటర్లలో ఇప్పటికి విజయవంతగా రన్ అవుతున్నా విషక్ష్ం తెలిసిదే. అంతేకాకుండా.. ఇటీవలే థియేటర్లలో విడుదలైన చిన్న హీరోల సినిమాలు కూడా కల్కి ముందు నిలబడలేదు.
ఈ నేపథ్యంలోనే థియేటర్స్ లో కల్కి ఇప్పటికి కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీ తాజా రూ.1100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ మేరకు ఈ విషయాన్ని అధికారకంగా నిర్మాత అశ్వినీత్ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. అయితే ఓవర్ సీస్ లో 18 మిలియన్ల క్రాస్ చేసి 20మిలియన్ల దిశగా కల్కి సాగుతోంది. కానీ, ప్రస్తుతం వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్లు కొద్దిగా వెనక్కి తగ్గాయి.ఇకపోతే ఓవర్సీస్ లో మాత్రం కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. అంతేకాకుండా.. ఆగస్టు వరకు పెద్ద థియేటర్స్ లో పెద్ద సినిమాలేవీ లేవు కనుక రానున్న రోజుల్లో ఇది బాలీవుడ్ షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ కలెక్షన్స్ ను క్రాస్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే కల్కి సినిమా ఇప్పటికి విడుదలై 5 వారంలోకి అడుగుపెట్టింది. దీంతో ఇప్పటి వరకు కల్కి సినిమాతో నిర్మాత అశ్వనీదత్ కు కలెక్షన్స్ వర్షం కురుస్తునే ఉంది. కాగా, ఇప్పటి వరకు అటు ఇటుగా లక్కి సినిమాకుగాను అశ్వినీ దత్ కు రూ 125 కోట్ల లాభాలు వచ్చాయని తెలుస్తోంది. అటు నైజాంలోను ఈ చిత్రం 80 కోట్ల రూపాయల షేర్ రాబట్టి ప్రభాస్ ను నైజాం నవాబ్ గా నిలిపింది. మరి, ప్రభాస్ కల్కి మూవీ ర.1100 క్లబ్ లోకి చేరడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.