Prabhas| ప్ర‌భాస్ పెళ్లిపై కొత్త రూమర్స్.. హైదరాబాద్ అల్లుడు కాబోతున్నాడా..!

Prabhas| టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తొచ్చే పేరు ప్ర‌భాస్.ఆయ‌న తోటి వాళ్లంద‌రు పెళ్లి చేసుకొని పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డుపుతుంటే ప్ర‌భాస్ మాత్రం ఆ ఊసే ఎత్త‌డం లేదు. ఆయన ఓ ఇంటివాడైతే చూడాలని తన డైహార్ట్ ఫ్యాన్స్ క‌ల‌లు కంటున్నారు. అయితే ప్ర‌భాస్ అదిగో ఇదిగో అంటున్నాడే త‌ప్ప పెళ్లిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌డం లేదు. 1979 అక్టోబర్ 23న జన్మించిన ప్రభాస్ వ‌య‌స్సు ఇప్పుడు 45 ఏళ్లు కాగా, ఆయ‌న ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడని ఇండ‌స్ట్రీలో జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ కు వేల్లల్లో పెళ్లి సంబంధాలు వచ్చాయంట.ప్రభాస్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వెళ్లడంతో ఏకంగా డార్లింగ్ తో పెళ్లికి సిద్ధమంటూ 5000 మంది మ్యారేజ్ ప్రపోజల్స్ వ‌చ్చిన కూడా ఆయ‌న వాట‌న్నింటిని ప‌క్క‌న పెట్టేశాడట‌.


ఆ మ‌ధ్య ప్రభాస్ త‌న స్నేహితుడు గోపిచంద్‌తో క‌లిసి నంద‌మూరి బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ షోలో పాల్గొన్నాడు.ఆ స‌మ‌యంలో బాల‌య్య‌.. ప్ర‌భాస్‌ని పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడ‌గ‌గా,తాను బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తర్వాత పెళ్లి చేసుకుంటానని ఫన్నీగా బదులిచ్చారు. ఇక ప్ర‌భాస్ త‌ల్లి శివ కుమారి, పిన్ని శ్యామ‌లాదేవి ప్ర‌భాస్ పెళ్లిపై ప‌లుమార్లు స్పందిస్తూ ఉంటారు. తొంద‌ర‌లోనే చేసుకుంటాడు అని చెబుతున్నారే తప్ప ప్ర‌భాస్ మాత్రం పెళ్లి పీట‌లు ఎక్క‌డం లేదు. తాజాగా ప్ర‌భాస్ పెళ్లికి సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తుంది. హైదరాబాద్ కి చెందిన ఓ బడా బిజినెస్ మెన్ కూతురిని ప్ర‌భాస్ పెళ్లి చేసుకోబోతున్నాడ‌ట‌. కృష్ణం రాజు భార్య శ్యామలా దేవి ఓ పెద్దింటి అమ్మాయిని చూసి లోలోపలే పెళ్లి ప‌నులు మొద‌లు పెట్టార‌నే టాక్ న‌డుస్తుంది.

ప్రభాస్ పెళ్లిపై పుకార్లు రావ‌డం ఇదేమి కొత్త కాదు. గ‌తంలో ఎన్నో ఇలాంటి వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చిన అవి రూమ‌ర్స్ లాగానే మిగిలిపోయాయి. మ‌రి ఈ వార్త కూడా రూమ‌ర్‌గానే మిగులుతుందా, లేదంటే 45 ఏళ్ల ప్ర‌భాస్ దీనిని నిజం చేస్తాడా అన్న‌ది చూడాలి. ఇక వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉన్న ప్ర‌భాస్ చివరిగా ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద హిట్ సాధించాయి. సలార్ ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించ‌గా, కల్కి 2898 ఏడీ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి మరో వెయ్యి కోట్ల సినిమాగా ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది.