పారిస్ పారాలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన ప్రీతీ పాల్, 100 మీటర్ల రేసులో కాంస్య పతకం

www.mannamweb.com


పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. అథ్లెట్ ప్రీతి పాల్ అద్భుత ప్రదర్శన చేసి పతకం సాధించింది.

100 మీటర్ల టీ35 విభాగంలో ప్రీతి దేశానికి కాంస్య పతకం అందించింది. ట్రాక్ ఈవెంట్‌లో పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి ప్రీతి. ఈ పోటీలో ప్రీతి తన వ్యక్తిగత రికార్డును తానే బీట్ చేసింది. ఈ రేసును 14.21 సెకన్లలో పూర్తి చేసిన ప్రీతి కాంస్యం గెలుచుకుని పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ పతకాన్ని అందించింది. రెండో రోజు ఆటలో భారత్ మూడు పతకాలు సాధించింది. షూటర్ అవనీ లేఖరా దేశానికి తొలి స్వర్ణం అందించగా, మోనా అగర్వాల్ కాంస్య పతకాన్ని సాధించారు. ఇప్పుడు ప్రీతి కూడా కాంస్య పతకం సాధించింది.

ప్రీతీ పాల్‌ భారత్‌కు మూడో పతకాన్ని అందించింది

మంచి ఫామ్‌ను కొనసాగిస్తోన్న ప్రీతీ పాల్

ఈ ఏడాది ప్రీతీ పాల్ మంచి ఫామ్ లో ఉంది. ఆరో ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు సాధించింది . దీని తరువాత మే 2024లో ప్రీతి జపాన్‌లోని కోబ్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది . T35 200 మీటర్ల ఈవెంట్‌లో ఈ పతకాన్ని గెలుచుకుంది . ఈ కాంస్య పతకంతో పాటు, ఆమె పారిస్ పారాలింపిక్స్‌కు కూడా అర్హత సాధించింది. ఇప్పుడు ప్రీతి మన దేశానికి మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ పతకాన్ని అందించింది.
జీవితంపై పోరాటం

ప్రీతి పాల్ మీరట్‌లో జన్మించింది. చిన్నతనం నుండి సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతోంది. మీరట్‌లో మంచి చికిత్స అందలేదు . అయినప్పటికీ జీవితం మీద ఆశకు కోల్పోకుండా తనదైన శైలిలో జీవిస్తోంది. క్రీడా ప్రపంచంలో తన పేరును లిఖించుకుంది. సిమ్రాన్ శర్మ కోచ్‌గా ఉన్న కోచ్ గజేంద్ర సింగ్ వద్ద ప్రీతి ఢిల్లీలో శిక్షణ పొందింది.