2030కి బంగారం ధర ఆ రేంజ్ లోపెరుగుతుందా? లక్షాధికారులు కూడా కొనలేరు!

www.mannamweb.com


బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇండియాలో అయితే బంగారం అంటే పడి చచ్చిపోతాం. ఆడ, మగ అనే తేడా లేకుండా బంగారం అంటే విపరీతమైన ఇష్టం. కానీ, బంగారం చూస్తే ఎండాకాలం వేడికంటే ఎక్కువ బగ్గు మంటోంది. గత కొన్ని వారాలుగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. మధ్యలో ఒక్కోరోజు తగ్గినా కూడా అది కేవలం కంటితుడుపు లాగానే ఉంటోంది. తర్వాతి రోజు బంగారం ధర మళ్లీ పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఒక బంగారం వ్యాపారి చేసిన వ్యాఖ్యలు అందరినీ భయ పెట్టడమే కాకుండా.. ఆందోళనకు గురి చేస్తోంది. మరోవైపు లాభాలు పొందే మార్గంలా కూడా కనిపిస్తోంది.

బంగారం అనేది ఇప్పటి వరకు అలంకరణ సాధనంగానే చూసేవాళ్లం. కానీ, గత కొన్ని సంవత్సరాలుగా బంగారం అనేది పెట్టుబడి సాధనంగా మారిపోయింది. బంగారం మీద పెట్టిన రూపాయి లాభాలు తెచ్చి పెడుతోంది. అయితే బంగారం కొనాలి అంటే.. ఇప్పుడే కొనుగోలు చేయండి.. 2030 నాటికి కొనలేరు అని నిపుణులు అంటున్నారు. అలా వాళ్లు అనడానికి గల కారణం ఏంటంటే.. సీఎన్బీసీలో ఇటీవల ఓ సమావేశం జరిగింది. ఆ సావేశంలో విఘ్నహర్త గోల్డ్ ఛైర్మన్ మహేంద్ర లూనియా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

2030నాటికి 10 గ్రాముల ధర రూ.1.68 లక్షలు ఉంటుందని ఆయన అంచనా వేశారు. అంటే ఒక్కో గ్రాము ధర అక్షరాలా రూ.16,800 అనమాట. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న ద్రవ్యోల్భణ పరిస్థితులు, యుద్ధ వాతావరణం, మరికొన్ని కారణాల రీత్యా బంగారం ధరలు పెరుగుతున్నాయి. పైగా చైనా నుంచి అధిక కొనుగోళ్లు కారణంగా కూడా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. మరి.. గోల్డ్ రేటు తగ్గదా అంటే? ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఇప్పుడల్లా బంగారం ధర తగ్గే ఆస్కారం లేదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్భణం దృష్ట్యా సంపద విలువ తగ్గకుండా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది బంగారం మీద పెట్టుబడులు పెడుతూ ఉంటారు. దేశాలు సైతం అదే పని చేస్తుంటాయి.

ఇప్పుడు నిపుణులు ఇస్తున్న సలహా ప్రకారం ప్రజలు కూడా బంగారం మీద పెట్టుబడులు పెట్టడమే సరైన సమయంగా చెప్తున్నారు. అందుకు కేంద్రం నుంచి ఒక మంచి ఆవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఏటా పలు సందర్భాల్లో సావరిన్ గోల్డ్ బాండ్ ప్లాన్(ఎస్జీబీ) బాండ్లను జారీ చేస్తూ ఉంటుంది. ఒక బాండు విలువ ఒక స్వచ్ఛమైన గ్రాము బంగారంతో సమానం. మీరు ఈ బాండ్లలో పెట్టుబడులు పెట్టుకుంటే మంచి లాభాలను ఆర్జించే ఆస్కారం ఉటుంది. ఒక వ్యక్తి అయితే గరిష్టంగా 4 కిలోల బంగారంతో సమానమైన బాండ్లను కొనుగోలు చేయచ్చు. ట్రస్టులు అయితే గరిష్టంగా 20 కిలోలతో సమానమైన బాండులను కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే.. రానున్న ఐదేళ్లలో బంగారం మీద పెట్టుబడే సరైన నిర్ణయం అంటూ నిపుణులు కూడా సూచిస్తున్నారు.