వాట్సాప్‌లో మీ ప్రైవేట్‌ చాట్‌ ఎవరికీ కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా…?

టెక్నాలజీ ప్రపంచంలో సెక్యూరిటీ, ప్రైవసీ అది పెద్ద సమస్యలుగా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. ప్రైవసీపై అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ముఖ్యంగా మహిళల్లో ఈ ఆందోళన ఎక్కువగా ఉంది. అయితే సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ యాప్‌లు గోప్యతను కీలక అంశంగా పరిగణనలోకి తీసుకున్నాయి. ఎక్కువగా వినియోగిస్తున్న మెసేజింగ్‌ యాప్స్‌లో ఒకటైన వాట్సాప్‌ అనేక ప్రైవసీ ఫీచర్‌లను (Chat Lock On Whatsapp) కలిగి ఉంది.

ఇప్పటికే వాట్సాప్‌ ఇటువంటి అనేక ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్ లాక్‌, View Once తరహా ఫీచర్‌లను అనేక మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. వ్యక్తిగత మెసేజ్‌లకు అదనపు భద్రతను అందించేందుకు చాట్ లాక్‌ ఫీచర్‌ బాగా ఉపయోగపడుతుంది. చాట్‌ లాక్‌ చేసిన కాంటాక్ట్‌లను ఎవరికీ కనిపించకుండా Hide చేసే అవకాశం కూడా ఉంది.

అయితే వాట్సాప్‌లో చాట్‌లాక్‌ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలి. ఈ ఫీచర్‌ మీ వ్యక్తిగత భద్రతను ఎలా కాపాడుతుంది. ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్‌, iOS యూజర్‌లకు అందుబాటులో ఉంది.

ప్రస్తుతం వాట్సాప్‌ ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఫీచర్‌ను కలిగి ఉంది. అంటే వాట్సాప్‌లో మెసేజ్‌లను పంపించిన, రిసీవ్‌ చేసుకున్న వ్యక్తులు మినహా ఎవరూ చదివేందుకు వీలులేదని వాట్సాప్ చెబుతోంది. వాట్సా్ప్‌ కూడా ఎన్‌క్రిప్షన్‌ను డీకోడ్‌ చేయలేదని చెబుతోంది.

వాట్సాప్‌లో మీ వ్యక్తిగత విషయాలు కలిగిన చాట్‌లను ఎవరూ చేసేందుకు వీలు లేకుండా లాక్‌ చేసుకోవచ్చు. చాట్‌లాక్‌ (Whatsapp Chat Lock) ఫీచర్‌ ద్వారా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇలా లాక్‌ చేసిన చాట్‌ను ఫేస్‌ ఐడీ, ఫింగర్‌ ప్రింట్‌, పాస్‌వర్డ్‌ ద్వారా మాత్రమే ఓపెన్‌ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇలా లాక్‌ చేసిన చాట్‌లను Locked Chat లో యాడ్‌ అవుతాయి.

ఇలా లాక్‌ చేసిన చాట్‌ల నోటిఫికేషన్‌ల వివరాలు కూడా ఇతరులకు తెలిసే అవకాశం లేదు. సరైన అథెంటికేషన్‌ ద్వారా మాత్రమే ఈ కాంటాక్ట్‌ను ఓపెన్‌ చేసేందుకు వీలుంది. ముఖ్యమైన చాట్‌లకు చాట్‌లాక్ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ ఫీచర్‌ను ఎలా యాక్టివేట్ చేసుకోవాలి.

వాట్సాప్‌లో చాట్‌లాక్ ఫీచర్ ఎలా యాక్టివేట్‌ చేయాలి?

– వాట్సాప్ ఓపెన్‌ చేశాక.. మీకు కావాల్సిన చాట్‌ను ఎంచుకోవాలి.

– Long Press చేశాక.. పైన కనిపించిన మూడు చుక్కల మెనుపైన (3 Dot Menu) క్లిక్ చేయాలి.

– అక్కడ Lock Chat ఆప్షన్ పైన క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

– పిన్‌, ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్ ఐడీతో యాక్టివేట్‌ చేసుకోవచ్చు.

అయితే ఇలా లాక్‌ చేసిన చాట్‌లను అన్‌లాక్‌ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఇందుకోసం Locked Chat ఆప్షన్‌లోకి వెళ్లి, కాంటాక్ట్‌ పైన సెలెక్ట్‌ చేసుకోవాలి. అనంతరం అక్కడ కూడా మూడు చుక్కల మెనూ కనిపిస్తుంది. అందులోనే అన్‌లాక్‌ ఆప్షన్‌ను గుర్తించవచ్చు. దానిపైన క్లిక్‌ చేసి చాట్‌ను అన్‌లాక్‌ చేయవచ్చు. ఫలితంగా ఆ చాట్‌ తిరిగి చాట్‌ మెనూలోకి వచ్చి చేరుతుంది. సీక్రెట్‌ కోడ్‌ ద్వారా కూడా ఈ ఫీచర్‌ను యాక్టివేట్‌, డియాక్టివేట్‌ చేసుకోవచ్చు.

లాక్‌ చేసిన చాట్‌ను Hide చేసుకొనే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం Locked Chat ఆప్షన్‌లోకి వెళ్లాలి. మీరు Hide చేయాలనుకుంటున్న చాట్‌పైన Long Press చేయాలి. అనంతరం మూడు చుక్కల మెనూ పైన క్లిక్‌ చేయాలి. అక్కడ కనిపించిన Hide Locked Chat ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.