మధ్యప్రదేశ్‌లో రైతు కుమార్తె ఘనత
Priya Yadav | ఇండోర్: ఆమె ఒక రైతు కుమార్తె.. 11వ తరగతిలో ఫెయిలయ్యింది. తన వైఫల్యాన్నే విజయంగా మార్చుకుంది. ఇప్పటికే ప్రభుత్వ శాఖలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నా తృప్తి పడలేదు.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపీపీఎస్‌సీ) పరీక్షలో ఆమె ఆరో ర్యాంకు సాధించడంతో త్వరలో డిప్యూటీ కలెక్టర్ కానుంది. ప్రియా యాదవ్‌కు చెందిన ఈ కథ ఎందరికో ఆదర్శం. పట్టుదల, కృషితో ప్రణాళికాబద్ధంగా చదివితే ఎలాంటి లక్ష్యానైనా అవలీలగా ఛేదించవచ్చునని ఆమె ఉదంతం తెలియజేస్తున్నది. 10వ తరగతిలో తాను క్లాస్ టాపర్‌నని, అయితే బంధువుల ఒత్తిడి మేరకు తనకు ఇష్టం లేకున్నా 11వ తరగతిలో సైన్స్ సబ్జెక్టు చదివి ఫిజిక్స్‌లో ఫెయిల్ అయినట్టు 27 ఏండ్ల ప్రియా యాదవ్ తెలిపింది.