ఇళ్లు కట్టుకోవాలని అనుకునే వారి కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయబోతున్నామని ప్రకటించారు సీఎం రేవంత్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు.
వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించామన్నారు.
ఈ ఒక్క ఏడాడే 22,500 కోట్ల రూపాయలు వెచ్చింది… పేదల కోసం 4,50,000 ఇళ్లు నిర్మించబోతున్నాం.
ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఇంటి స్థలం లేని వారికి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నామని ప్రకటన చేశారు సీఎం రేవంత్.