పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్.. రన్ టైమ్ 20 నిమిషాలు పెరిగింది.. థియేటర్లలో ఎప్పటి నుంచంటే?

www.mannamweb.com


పుష్ప 2 మూవీ రన్ టైమ్ ఇప్పటికే 3 గంటల 15 నిమిషాలు. ఇదే చాలా ఎక్కువ అనుకుంటే ఇప్పుడు మేకర్స్ రీలోడెడ్ వెర్షన్ పేరుతో మరో 20 నిమిషాల ఫుటేజీని జోడించి తీసుకొస్తున్నారు.

దీంతో మూవీ రన్ టైమ్ మూడున్నర గంటలకుపైనే కానుంది. ఈ కొత్త వెర్షన్ ను సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో ప్రదర్శించనున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ మంగళవారం (జనవరి 7) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్

పుష్ప 2 మూవీ గతేడాది డిసెంబర్ 5న రిలీజై ఇప్పటికే ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. మూవీ నిడివి మరీ 3 గంటల 15 నిమిషాలు ఉన్నా కూడా ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా అల్లు అర్జున్ నటనకు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో మేకర్స్ మరో 20 నిమిషాల ఫుటేజీ జోడించి పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తున్నారు. జనవరి 11 నుంచి ఈ కొత్త వెర్షన్ థియేటర్లలో ప్రదర్శితం కానుంది. “పుష్ప 2 ది రూల్ రీలోడెడ్ వెర్షన్.

20 నిమిషాల అదనపు ఫుటేజీతో జనవరి 11 నుంచి సినిమాల్లో ప్రదర్శిస్తారు. ది వైల్డ్ ఫైర్ కు మరింతగా మండనుంది పుష్ప 2 రీలోడెడ్” అనే క్యాప్షన్ తో మేకర్స్ ఈ విషయం వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సంక్రాంతి సందర్భంగా తెలుగులో మూడు కొత్త సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పటికీ పుష్ప 2పై ఆసక్తి తగ్గకుండా ఉండటానికి మేకర్స్ ఈ కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది.

పుష్ప 2 బాక్సాఫీస్ కలెక్షన్లు

పుష్ప 2 మూవీ ఇప్పటికే ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. 33 రోజుల్లో ఇండియాలో ఈ మూవీ రూ.1441 కోట్లు వసూలు చేసింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల్లో దంగల్ తర్వాత రెండో స్థానంలో ఉంది.

దంగల్ మూవీ రూ.2070 కోట్లు వసూలు చేయగా.. పుష్ప 2 మూవీ 33 రోజుల్లో రూ.1850 కోట్లకు చేరువైంది. సంక్రాంతి సినిమాలు వస్తున్న సమయంలో పుష్ప 2 జోరు తగ్గిపోయింది. గేమ్ ఛేంజర్ లాంటి మూవీస్ రిలీజైతే మరింత పడిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో మేకర్స్ ఇప్పుడిలా అదనపు 20 నిమిషాలు జోడించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎంత వరకూ వర్కౌట్ అవుతుందో చూడాలి.