ఈరోజుల్లో ప్రతి ఒక్కరి ఆహారపు అలవాట్లు మారిపోయాయి. దీనివల్ల అనేక రోగాల బారిన పడుతున్నారు. ప్రధానంగా సమయపాలన లేకుండా తింటుండటంవల్ల గ్యాస్ వస్తోంది.
గ్యాస్ అనేది వచ్చిందంటే శరీరంలోకి అన్ని రోగాలు రావడానికి ఇది ప్రధాన ద్వారం లాంటిది. గ్యాస్ వస్తే మిగతా రోగాలన్నీ ఒకదాని వెంట మరొకటిగా వచ్చేస్తుంటాయి. షుగరు ప్రధానమైంది. ఇది రావడంవల్ల మనిషి ఏమీ తినలేక నీరసపడిపోతుంటాడు.
మరోవైపు గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఈ బాధలు మన పగవాడికి కూడా వద్దనుకుంటాం. ఆయుర్వేదం ప్రకారం గ్యాస్, షుగరు తగ్గాలంటే ఉదయం నిద్ర లేవగానే పరగడుపున కొంచెం మెంతి గింజలు మింగాలి. వీటిని మజ్జిగతో తీసుకోవాలి. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మీకు అదేరోజు నుంచి తెలుస్తాయి.
మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
మెంతులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఇది మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించేస్తుంది.
మెంతులు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి.
అందుకే ఇవి షుగరు ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరం.
మెంతులలో కరిగే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
మెంతులు త్వరగా కడుపు నిండిన భావనను కలిగించి, ఆకలిని తగ్గిస్తాయి. దీని వలన బరువు తగ్గడానికి సహాయపడతాయి.
మెంతులు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని వాపును తగ్గించడంలో తోడ్పడతాయి.
రాత్రి నానబెట్టిన మెంతులను ఉదయం తినడం వల్ల కడుపులో యాసిడ్ బ్యాలెన్స్ అవుతుంది. దీంతో ఎసిడిటీ తగ్గుతుంది.
































