ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క కొత్త ‘పురమిత్ర యాప్’ – పట్టణ ప్రజల సేవలకు డిజిటల్ పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను సులభంగా పరిష్కరించడానికి పురమిత్ర యాప్ని ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా 119 రకాల సేవలను ఇంటి నుండే పొందవచ్చు. అధికారాలకు ఎక్కడికీ వెళ్లకుండా, ఫోటో లేదా వాయిస్ మెసేజ్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయొచ్చు. సమస్యల పరిష్కారానికి 24 గంటల నుండి 30 రోజుల వరకు గడువు ఉంటుంది.
పురమిత్ర యాప్ యొక్క ప్రత్యేకతలు
- 8 ప్రధాన విభాగాలు: పరిశుభ్రత, ప్రజారోగ్యం, నీటి సరఫరా, పట్టణ ప్రణాళిక, పేదరిక నిర్మూలన, ఇంజినీరింగ్, వీధి దీపాలు, రెవెన్యూ.
- AI టెక్నాలజీ: ఫోటో అప్లోడ్ చేస్తే స్వయంచాలకంగా లొకేషన్ డిటెక్ట్ అవుతుంది.
- చాట్‌బాట్ & వాయిస్ సపోర్ట్: ఫోటో తీయలేనప్పుడు తెలుగు లేదా ఇంగ్లీషులో ఫిర్యాదు చేయొచ్చు.
- ట్రాక్ చేయగలిగే వ్యవస్థ: గడువు లోపల సమస్య పరిష్కారం కాకపోతే, అధికారులు ఆటోమేటిక్‌గా అలర్ట్ అవుతారు.
- సులభ రిజిస్ట్రేషన్: మొబైల్ నంబర్ & OTPతో వెంటనే యాప్‌ను ఉపయోగించవచ్చు.
యాప్ ఎలా ఉపయోగించాలి?
- ప్లే స్టోర్ నుండి PuraMitra App డౌన్‌లోడ్ చేయండి.
- మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వండి.
- సమస్యను ఫోటో తీసి అప్‌లోడ్ చేయండి లేదా వాయిస్ మెసేజ్ పంపండి.
- పరిష్కారాన్ని రియల్ టైమ్‌లో ట్రాక్ చేయండి.
కేవలం 15 రోజుల్లో 12,000+ యూజర్లు రిజిస్టర్ అయ్యారు, 500కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఎక్కువగా చెత్త నిర్వహణ, రోడ్డు బాగుచేయడం, డ్రైనేజీ, ప్రాపర్టీ టాక్స్ సమస్యలు నమోదు చేయబడ్డాయి.