హీరోయిన్స్ కారవ్యాన్లలో సీక్రెట్ కెమెరాలు.. రాధిక సంచలన వ్యాఖ్యలు

www.mannamweb.com


రంగం ఏదైనా మహిళలకు రక్షణ లేకుండా పోతోందని సాధారణ వ్యక్తుల నుంచి సినిమా హీరోయిన్స్ వరకు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా అందరినీ వెంటాడుతున్న భయం సీక్రెట్ కెమెరాలు. తాజాగా సినియర్ నటి రాధిక చేసిన కొన్ని వ్యాఖ్యలు సినిమా ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. మలయాళం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా హేమ కమిటీ ఒక నివేదికను ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నివేదికకు సంబంధించి ఎంతో మంది ప్రముఖు స్పందించారు. ఇప్పుడు ఆ జాబితాలోకి సీనియర్ నటి రాధిక కూడా చేరారు. అంతేకాకుండా.. పలు ఆందోళన కలిగించే అంశాలను వెల్లడించారు. కారవ్యాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టేవాళ్లు అంటూ రాధిక చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

రాధిక ఏమన్నారంటే.. “నేను 46 ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో మహిళలకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కావడం నిజంగా దురదృష్టకరం అనే చెప్పాలి. కేవలం సినిమాలు అనే కాదు.. అన్ని చోట్లా మహిళలకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. నాకు కేరళలో జరిగిన ఒక విషయాన్ని చెబుతాను. నేను ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్తున్నాను. ఆ సమయంలో సెట్స్ లో ఉన్న కుర్రాళ్లు అంతా ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారు. వాళ్లు ఏదో

వీడియో చూస్తున్నారు అని నాకు అర్థమైంది. నేను ఒక కుర్రాడిని పిలిచి ఏం చూస్తున్నారు అని ప్రశ్నించాను. అతను కారవ్యాన్ లో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. ఆ వీడియోలు చూస్తున్నారు అని చెప్పాడు.

ఆ మాటలు విన్న తర్వాత నాకు కారవ్యాన్ లో అడుగు పెట్టాలి అంటే భయం వేసింది. ఎందుకంటే సినిమా షూటింగ్ లో మాకున్న ప్రైవేట్ స్పేస్ అదే. అక్కడే డ్రెస్ ఛేంజ్ చేసుకుంటాం, తింటాం, కాస్త విశ్రాంతి తీసుకుంటాం. ఇంకెప్పుడైనా కారవ్యాన్స్ లో కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెప్తాను అని వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. ఆ విషయానికి సంబంధించి సినిమా యూనిట్ కి కంప్లైంట్ కూడా చేశాను” అంటూ రాధిక అప్పటి విషాన్ని వెల్లడించారు. కేరళలో ఒక్కసారిగా సీనియర్ నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. మోహన్ లాల్ సహా అమ్మ సభ్యులు మొత్తం బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా కూడా చేశారు. కేరళలోనే కాదు.. తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి తరహా పరిస్థితులే ఉన్నాయి అంటూ.. సీనియర్ నటి కుట్టి పద్మిణి ఆరోపించారు.