మన భారతదేశంలో పూర్వం నుంచి చిరుధాన్యాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చిరు ధాన్యాలలో రాగులు కూడా ఒకటి. ఇందులో క్యాల్షియం, పొటాషియం, కొవ్వుపదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.
అంతేకాకుండా ఇందులో విటమిన్-B, ఐరన్ చాలా సమృద్ధిగా లభిస్తాయి కనుక రాగులు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు కావున ప్రతి ఒక్కరు కూడా ఈ రాగి జావ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు.
ప్రతిరోజు ఉదయాన్నే ఈ రాగి జావ తాగడం వల్ల ఎటువంటి రోగానికైనా చెక్ పెట్టవచ్చని నిపుణులు తెలియజేయడం జరుగుతోంది. ఈ రాగులతో ఉప్మా చేసుకున్నట్లు అయితే శరీరానికి చాలా అధిక బలం చేకూరుతుందట. ఒకవేళ రాగులు మొలకెత్తినవి తింటే మన శరీరానికి బలమైన పోషకాలను రాగులు చేరుస్తాయి. రాగులలో ఎక్కువగా గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటాయి కావున రాగులు మధుమేహ రోగులకు మంచి ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్ను నియంత్రించే పోషకాలు ఉండడం వల్ల గుండెను రక్షిస్తూ ఉంటాయి.
ఇందులో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పేగులలో పుండ్లు, పెద్దపేగు క్యాన్సర్ నుంచి రక్షించే గుణాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. అందుచేతనే మన పూర్వీకులు ఎక్కువగా రాగి జ్యూస్ తాగే వారు. అంతేకాకుండా వారు ఎటువంటి రోగాలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. రక్తహీనత సమస్యతో బాధపడే వారు వీటిని ప్రతి రోజూ ఒక గ్లాసు తో తాగడం మంచిది. దీని ద్వారా ఎముకలు దృఢం గా ఉండడమే కాకుండా కండరాలు బలం కూడా చేకూరుతాయి. అందుచేతనే ఉదయాన్నే రాగి జావ తాగితే.. ఇలాంటి సమస్యల పైన చెక్ పెట్టవచ్చు. వేడి నీటిలో ఈ రాగి పిండి జావా ను కలుపుకొని తాగడం వల్ల రుచిగ ఉంటుంది.