ఏపీలో పండుగల సీజన్ లో ప్రయాణాలు పెరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులకు రద్దీ తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తోంది.
దీంతో పాటు పలు స్టేషన్లలో అదనపు హాల్ట్ లు కూడా ఇస్తున్నారు. ఇదే క్రమంలో దక్షిణ రైల్వే పండుగల సందర్బంగా ప్రకటించిన 8 ప్రత్యేక రైళ్లలో అదనపు స్టేషన్ల హాల్ట్ లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన చేశారు.
పండుగల సందర్భంగా ఈ నెల 23, 24 తేదీల్లో అరకు-యలహంక మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారు. అలాగే 14, 24 తేదీల్లో యలహంక నుంచి అరకుకు మరో రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. తిరిగి 17, 24 తేదీల్లో అరకు నుంచి యలహంకకు మరో రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. అలాగే యలహంక నుంచి అరకుకు 18, 25 తేదీల్లో మరో రెండు ప్రత్యేక రైళ్లు ప్రకటించారు. వీటితో పాటు 21న శ్రీకాకుళం రోడ్డు-బెంగళూరు కంటోన్మెంట్, 24న బెంగళూరు కంటోన్మెంట్ నుంచి శ్రీకాకుళం రోడ్డు, 16న భువనేశ్వర్ నుంచి బెంగళూరు కంటోన్మెంట్ కు, 20న బెంగళూరు కంటోన్మెంట్ నుంచి భువనేశ్వర్ కు ఒక్కో రైలు ప్రకటించారు.
ఇందులో అరకు-యలహంక ప్రత్యేక రైళ్లకు కొత్తగా మార్కాపూర్ రోడ్డు, నరసరావుపేట అదనపు స్టాపులుగా ఇచ్చారు. అలాగే శ్రీకాకుళం రోడ్డు-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్డు అదనపు స్టాప్ లుగా ఇచ్చారు. అలాగే భువనేశ్వర్-బెంగళూరు కంటోన్మెంట్ రైళ్లకు అనకాపల్లి, గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్డు అదనపు స్టాప్ లుగా ఇచ్చారు. అలాగే సంబల్ పూర్-బెంగళూరు కంటోన్మెంట్, కటక్-బెంగళూరు కంటోన్మెంట్ ప్రత్యేక రైళ్లకు కూడా గుంటూరు, నరసరావుపేట, మార్కాపూర్ రోడ్డు అదనపు స్టాప్ లుగా ఇచ్చారు.

































