తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీ

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సంగారెడ్డి, వికారాబాద్‌, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. శుక్రవారం కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.