రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజా సాబ్'(Raja Saab Movie) ఈ సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న సందర్భంగా మేకర్స్ నిన్నటి నుండి ప్రమోషనల్ కంటెంట్ ని విడుదల చేయడం మొదలు పెట్టారు మేకర్స్.
నిన్న ఈ చిత్రం నుండి విడుదలైన ‘రెబెల్ సాబ్’ లిరికల్ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది. సంగీత దర్శకుడు థమన్ ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి ఒక రేంజ్ లో తిట్టడం మొదలు పెట్టారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా సూపర్ స్టార్ కి ఇలాంటి పాటలు కంపోజ్ చేస్తావా అంటూ థమన్ కనిపిస్తే కొట్టేంత కోపం లో కొంతమంది ఫ్యాన్స్ ఉంటే, మరి కొంతమంది మాత్రం పాట ఎలా ఉన్నా జనాల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
అదేమిటంటే ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదట. 5 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉందట. అంతే కాకుండా సినిమాలోని కొన్ని సన్నివేశాలను రీ షూట్ కూడా చెయ్యాల్సిన అవసరం ఉందట. ఇప్పటికే ఈ చిత్రానికి నిర్మాత విశ్వప్రసాద్ బడ్జెట్ విషయం లో హద్దులు దాటేశాడు. రెండు సార్లు VFX కోసం డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ వర్క్ కూడా ఇంకా పూర్తి అవ్వలేదు. అదే విధంగా చాలా సన్నివేశాలను రీ షూట్ కూడా చేయాల్సి వచ్చింది. ఆ రీ షూట్ చేసిన సన్నివేశాల్లో కూడా ఇప్పుడు కొన్ని షాట్స్ ని రీ షూట్ చేయాలనీ నిర్మాత విశ్వప్రసాద్ తో అన్నాడట డైరెక్టర్ మారుతీ. దీనికి సహనం కోల్పోయిన విశ్వప్రసాద్, ఇక నేను డబ్బులు పెట్టే పరిస్థితిలో లేను, హీరో లేదా డైరెక్టర్ సొంత డబ్బులు పెట్టుకొని మిగిలిన షూటింగ్ ని పూర్తి చేసుకోమని చేతెలెత్తేశాడట.
ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ సినిమా చివరి దశలో ఉన్నప్పుడు డబ్బులు పెట్టడానికి నిర్మాత ఎందుకు నిరాకరించాడు?, అసలు ఆయన ఉద్దేశ్యం ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే డైరెక్టర్ మారుతీ పనితనం పై అసహనం కి గురి అవ్వడం, అదే విధంగా హీరో ప్రభాస్ కి ఏ సన్నివేశం కూడా ఒక పట్టాన నచ్చకపోవడం తో, నా వల్ల కాదు, ఇక మీరే చూసుకోండి అన్నట్టుగా నిర్మాత వదిలేసాడని టాక్. మరి ఈ రూమర్ పై నిర్మాత విశ్వప్రసాద్ స్పందిస్తాడో లేదో చూడాలి. ఎందుకంటే ప్రతీసారి సోషల్ మీడియా లో రాజా సాబ్ గురించి రూమర్ వచ్చినప్పుడు ఒక ప్రెస్ నోట్ ని విడుదల చేసేవాడు విశ్వప్రసాద్. మరి ఈసారి అలా ప్రెస్ నోట్ విడుదల చేస్తాడా?, ఒకవేళ చేయకపోతే ఈ రూమర్ ని నిజం అని నమ్మే అవకాశాలు ఎక్కువ.



































