గోదావరి పుష్కరాలు -2027ని దృష్టిలో పెట్టుకుని రాజమహేంద్రవరాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధంచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్‌మీనా ఆదేశించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం గోదావరి పుష్కర పనులపై సమీక్షలో కమిషనర్ మాట్లాడారు. గోదావరి పుష్కరాలకు 21 నెలల వ్యవధి ఉందన్నారు. అందువల్ల వేగంగా నగరపాలక సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. శాశ్వత మౌలిక వసతులపై దృష్టిపెట్టాలన్నారు. లక్షల్లో భక్తులు రాజమహేంద్రవరానికి వస్తారని, ఎక్కడా ఇబ్బంది లేకుండా రహదారుల నిర్మాణం, వాహనాల పార్కింగ్, తాగునీరు, స్నానాల ఘాట్లు వంటి అన్ని వసతులు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. పుష్కరాల్లో రద్దీని ని యంత్రణ కోసం ప్రతీ ఘాట్ వద్ద ఏఐ టెక్నాల జీ స్మార్ట్ పోల్స్ ఏర్పాటుచేయాలని సూచించా రు. దీని ద్వారా ఏఐ సహాయంతో భక్తుల రద్దీని ముందుగానే పసిగట్టి ప్రమాదాలు నివారించవచ్చన్నారు. కుంభమేళాలో ఈ విధానం విజయవంతమైందన్నారు. భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలు కల్పించాలని, అందుకోసం నగరంలో కల్యాణ మండపాలు, పాఠశాలలు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లను చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ పీవీ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎస్‌ఈ ఇంచార్జి రీటా, ఎంహెచ్‌వో డాక్టర్ వినూత్న, అధికారులు పాల్గొన్నారు.
































